Sye Raa Narasimha Reddy Movie Review | Mega Star Chiranjeevi | Ram Charan | Surendar Reddy | Nayanatara |

Sye Raa Narasimha Reddy Movie Review | Mega Star Chiranjeevi | Ram Charan | Surendar Reddy | Nayanatara |

Sye Raa Narasimha Reddy Movie Review | Mega Star Chiranjeevi | Ram Charan | Surendar Reddy | Nayanatara |

మెగాస్టార్ చిరంజీవి , సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన మెగాస్టార్ 151 సినిమా సైరా నరసింహ రెడ్డి ఈ సినిమా పై అటు మెగా అభిమానుల్లో ను ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి .అంతేకాకుండా ఈ సినిమా పలు భాషల్లో విడుదలకు సిద్ధమవ్వటం తో ఈ సినిమా పై ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశం మొత్తంగా ఈ సినిమా పై మంచి హైప్ వచ్చింది .ఇక ఈ  సినిమా నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్ భారీ వ్యయంతో నిర్మించాడు .ఇది చిరంజీవి కి కెరీర్ లోనే అత్యంత ముఖ్యమైనా సినిమా ,చిరంజీవి కల అనే చెప్పాలి .ఇప్పటివరకు చిరంజీవి తన కెరీర్ లో ఇలాంటి సినిమా లో నటించలేదు అన్తెకకుద్న చిరుకి కూడా ఎప్పటి నుండో ఇలాంటి సినిమా లో నటించాలి అని ఆశ .చిరు కల ని తనయుడు రామ్ చరణ్ సైరా రూపంలో నెరవేర్చాడు అనే చెప్పాలి .

అయితే ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు తీయలేదు .అయితే ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను తెరకేక్కించాలి అంటే అది రాజమౌళి తరువాతే ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాల మంది చేసారు కాని ఒక్క రాజమౌళి మాత్రమే విజయం సాధించారు .మగధీర , బాహుబలి వంటి సినిమా మన ఇండియా సిని స్థాయిని పెంచేశాయి .మరి ఇలాంటి సమయంలో చిరు చిరకాల ప్రాజెక్ట్ ను కమర్షియల్ సినిమా లను తీసే సురేందర్ రెడ్డి కి ఇవ్వటం అనేది చాల మందికి అనుమానం కూడా వుండేది .అసలు సురేందర్ రెడ్డి ఇలాంటి సినిమాలను డీల్ చెయ్యగలడా …అంటూ రకరకాల కామెంట్స్ వస్తున్నా తరుణం లో ఒక్క ట్రైలర్ తో సినిమా పై వున్నా అనుమానాలకు చెక్ పెట్టడమే కాకుండా సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి .అయితే భారీ అంచనాల నడుమ ఈ రోజు సైరా నరసింహ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది అయితే మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం .

సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ :

నటీనటులు : చిరంజీవి ,అమితా బచ్చన్ ,నయనతార ,తమన్నా ,విజయ్ సేతుపతి ,కిచ్చ సుదీప్ ,జగపతిబాబు మొదలుగు వారు

దర్శకత్వం : సురేందర్ రెడ్డి

నిర్మాత : రామ్ చరణ్

ఫోటోగ్రఫి : రత్నవేలు

మ్యూజిక్ :అమిత్ త్రివేది (సాంగ్స్), జూలియస్ పాంక్ (బాక్గ్రౌండ్ స్కోర్ )

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

కథ :

భారదేశాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చిన బ్రిటిష్ వారు భారత్ దేశ ప్రజలపై ఎన్నో అక్రమాలకు ,అన్యాయాలకు పాల్పడేవారు .ఈ తరుణం లో బ్రిటిష్ వారి పై భారదేశ ప్రజలు ఎదురు తిరగలేక పాలెగాళ్ళు అందరూ లొంగిపోవటం జరుగుతుంది .ఈ క్రమం లో రేనాడు ప్రాంతానికి చెందిన రాజు (పాలెగాడు ) ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి (చిరంజీవి ) బ్రిటిష్ వారు చేసే అక్రమాలకు అన్యాయాలకు తట్టుకోలేక బ్రిటిష్ వారికీ ఎదురు తిరిగి బ్రిటిష్ వారు దోచుకోబోతున్న సంపదను మరియు ఆక్రమించుకుంటున్న భూమిని అడ్డుకుని వారి నుండి కాపాడి ప్రజలకు అప్పగించట మే కాకుండా ప్రజలకు అండగా నిలబడతాడు .ఇక ఇదే సమయంలో నరసింహ రెడ్డి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు ఇక తను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కాని నరసింహ రెడ్డి కి ,సిద్దమ్మ తో చిన్నప్పుడే పెళ్లి అయిపొయింది అని తెలుసుకుని తానూ ప్రేమను ప్రజలకోసం త్యాగం చేస్తాడు .దేశ స్వేచ్చ కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటాడు .ఇక నేపధ్యంలో బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేస్తూ నరసింహ రెడ్డి కూడా ప్రజల్లో చైతన్యం కలిగించి  తన సైన్యాన్ని బలపరచుకుంటు ఉద్యమాన్ని నడుపుతాడు .ఈ క్రమం లో నరసింహ రెడ్డి బ్రిటిష్ వారిపై ఎలా తిరుగు బాటు చేసాడు వారిని ఎలా ఎడురించాడు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే సైరా నరసింహ రెడ్డి సినిమా చూసి తీరాల్సిందే .

విశ్లేషణ :

భారీ తారాగణం తో తెరకెక్కిన సైరా నరసింహ రెడ్డి సినిమా లో అన్ని పాత్రలకు పాత్రదారులు వెయ్యి రెట్లు న్యాయం చేసారు అనే చెప్పాలి ఎందుకంటే ప్రతి పాత్ర కూడా చాల రియల్ గా కనిపించింది .ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే అల్టిమేట్ అనే చెప్పాలి .ఈ సినిమా చుసిన తరువాత ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్రలో ఎవరిని ఊహించుకోలేము అప్పట్లో నరసింహ రెడ్డి అచ్చం ఇలానే వున్నాడు అనుకుంటారు .ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే అక్కడక్కడ కాస్త నెమ్మదిస్తుంది రానురాను సినిమా   కొంచెం కొంచెం లేస్తూ ఇంటర్వెల్ కి వచ్చేసరికి  ఒక రేంజ్ కి చేరుకుంటుంది .ఇక సెకండ్ హాఫ్ అంతా చాలా అద్భుతంగా తీర్చి దిద్దాడు సురేందర్ రెడ్డి .ఇక సినిమా హిట్ లో కీలాక్ పాత్ర పోషించిన సెకండ్ హాఫ్ విజయవంతం కావటం తో సినిమా విజయం హిట్ రేంజ్ కి చేరుకుంది .అయితే సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం సినిమా స్క్రిప్ట్ ని చాలా బాగా రాసుకున్నాడు అనే చెప్పాలి సురేందర్ రెడ్డి పనితనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అందంగా అద్భుతంగా వుండే విధంగా తీర్చి దిద్దటంలో సురేందర్ రెడ్డి నూటికి నూరు శాతం విజయం సాధించాడు అని చెప్పవచ్చు .ఈ సినిమా లో మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ తోపాటుగా ఎమోషన్ ను పండించటం లో కుద దర్శకుడు సురేందర్ రెడ్డి విజయం సాధించాడు ఇక ఈ సినిమా వెన్నుముఖ క్లైమాక్స్ ని మాత్రం కన్నీళ్ళు తెప్పించి సినిమా ని మరో లెవెల్ కి తీసుకెళ్ళాడు .

ఇక గోసాయి వెంకన్న గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అద్భుతంగా చేసాడు అలాగే మిగిలిన విజయ్ సేతుపతి ,సుదీప్ ,జగపతి బాబు వంటి స్టార్స్ అదిరిపోయే రేంజ్ లో నటించారు .వీరి పాత్రల నటనతో సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి .ముఖ్యంగా ఒక పాత్రకి మరో పాత్రకి వైవేధ్యాన్ని చూపిస్తూ చాల అందంగా తీర్చిదిద్దాడు దర్శుకుడు సురేందర్ రెడ్డి .అలాగే బుర్రా సాయి మాధవ్ కూడా తన డైలాగ్స్ తో సినిమా కి ప్రధాన పాత్ర పోషించాయి అని చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం :

సైరా నరసింహ రెడ్డి సినిమా కి ప్రేక్షకుల్లో గూమ్స్ బుమ్ప్స్ రావటానికి జూలియస్ పాకియం  నేపధ్య సంగీతం ముఖ్య పాత్ర వహించింది అలాగే అమిత్ త్రివేది పాటలు మరియు ఆ పాటల్లో విజువల్స్ కుడా బాగున్నాయి .ఇక సినిమా మరో మెయిన్ పాత్ర పోషించింది రత్నవేలు అవును రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమా ని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది ఇక అలాగే శ్రీకర్ ప్రసాద్ సినిమా ఎడిటింగ్ కుడా చాలా బాగుంది .ఇక నిర్మాత రామ్ చరణ్ ఎక్కడ వెనుకాడకుండా భారీ ఖర్చు చేసి సినిమా ని అద్భుతంగా తెరకెక్కించాడు .

నటీనటులు :

ఇక చిరంజీవి నటన గురించి అయితే మనం మాట్లాడలేము అనే చెప్పాలి ఎందుకంటే అంతా బాగా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి [పాత్రలో ఒదిగిపోయాడు .ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గోసాయి వెంకన్న గా చాల బాగా చేసాడు ,అలాగే విజయ్ సేతుపతి ,సుదీప్ ,జగపతి బాబు వంటి వారు చాలా అద్బుతంగా చేసారు .ఇక హీరోయిన్ ల విషయనికొస్తే లక్షి గా తమన్నా కుడా  అచల నటించింది అలాగే సిద్దమ్మ పాత్రలో నయనతార అద్బుతమైనా నటన ను కనబర్చింది .

రివ్యూ : 

ఫైనల్ గా సైరా సినిమా తెలుగు సినిమా స్థాయితో పాటు ఇండియన్ సినిమా స్థాయిని కూడా చాటి చెప్పే చిత్రం

రేటింగ్ : 3.5/5

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: