Radhe Shyam Movie Review | Prabhas | Pooja Hegde |

Radhe Shyam Movie Review | Prabhas | Pooja Hegde |

Radhe Shyam Movie Review | Prabhas | Pooja Hegde |

నటీనటులు :

ప్రభాస్ , పూజ హెగ్డే , సచిన్ ఖేడ్కర్ ,కృష్ణం రాజు,జగపతి బాబు ,జయరాం ,భాగ్య శ్రీ ,మురళీ శర్మ ,ప్రియ దర్శి తదితరులు.

రచన , దర్శకత్వం : రాధా కృష్ణన్

సంగీతం: జస్టిన్ ప్రభాకరన్

నిర్మాత ; వంశి ప్రమోద్

పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక మ్చ్న్హి గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా ఎన్నో అంచనాలతో మరో అందమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ,అయితే గతం లో నటించిన బాహుబలి సినిమా తో ప్రభాస్ క్రేజ్ అమాంతం జాతీయ స్థాయికి చేరుకుంది .అయితే ఆ తరువాత వచ్చిన సాహో మూవీ మాత్రం నిరాశ పరచింది దీంతో డార్లింగ్ ఫాన్స్ మాత్రం రాదే shyam సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు .మరి ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది .మరి రాదే shyam సినిమా అంచనాలను రీచ్ అయిందా ,ప్రభాస్ కి హిట్ పడిందా లేదా అన్నది టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం >

కథ :

విక్రం ఆదిత్య (ప్రభాస్ ) ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు కొన్ని కారణాల వలన తన తల్లి తండ్రులతో కలసి ఇటలీలో సెటిల్ అవుతాడు అయితే విక్రం చేతి రేఖలో ప్రేమ అనేది లేదు అని నమ్మి ప్రతి అమ్మాయితో కొంత వరకు ప్రేమాయణం నడిపి ఆ తరువాత వాళ్ళకు దూరమవుతాడు .అలాంటి వ్యక్తీ కి అసలు జ్యోతిష్యాన్నే నమ్మని డాక్టర్ ప్రేరణ కి విక్రం ఆదిత్య ఎలా కనెక్ట్ అయ్యాడు .విక్రం పై ప్రేమ ను పెంచుకున్న ప్రేరణ కి దూరం అవ్వాలి అనుకున్న సమయం లో ప్రేరణ కొంత కాలమే బ్రతుకుతుంది అని విక్రం తెలుసుకుంటాడు కాని ప్రేరణ చేయి చూసి న విక్రం తను నిండు నూరేళ్ళు బ్రతుకుతుంది అని చెబుతాడు .అసలు ప్రేరణ విషయం లో విక్రం నమ్మకం నిజమయిందా లేదా అసలు వీరి ప్రేమ ఎంత వరకు వెళ్ళింది అనేది రాదే శ్యాం కథ .ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి ఈ కథ పూర్తిగా 70 వ దశకం లో జరిగే కథ .

విశ్లేషణ :

సినిమాలో ఎన్ని హంగులు వున్న ఊహించని లోకానికి తీసుకెళ్ళిన కథ బలం లేకపోతె ఏమి చెయ్యలేము అనేది రాదే shyam సినిమా చుస్తే అర్ధమవుతుంది .ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ , పూజ హెగ్డే లాంటి  మంచి క్రేజ్ వున్న రొమాంటిక్ జంట ,ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసే ఆర్ట్ దర్శకులు , విజువల్ చక్కగా చూపించే ఫోటో గ్రాఫర్ లు ,భారీ తారాగణం ఇలా ఎన్నో ఇంకెన్నో వున్న ఈ సినిమా లో కథ ,కథనం మరియు దర్శకత్వం పూర్తిగా నిరాశ పరిచాయి అనేది రాదే shyam సినిమా చుసిన ప్రతి ఒక్కరికి అర్ధమయిపోద్ది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఈ సినిమా లో హీరో హస్త సాముద్రిక నిపుణుడు. అయితే ఈ నేపథ్యం లో కొంత కథ నడిచినప్పటికీ మిగత కథ అంత కూడా ప్రేమ కథ మీదే నడుస్తుంది .కాబట్టి హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ప్రయణం మీదే ఈ సినిమా ఆధారపడి వుంటుంది కాని ఈ సినిమా లో మైనస్ పాయింట్ కొన్ని ప్రేమ సన్నివేశాలు చెప్పొచ్చు .ఎందుకంటే హీరోయిన్ హీరో ల మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుండాలి అదే సమయం లో ప్రేక్షకులకు కూడా ఆ ప్రేమను ఫీల్ అవ్వాలి కాని ఈ సినిమాలో దర్శకుడు ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వలేదు .ఒక్క పాటలోనే హీరో హీరోయిన్ లు పీకల్లోతు ప్రేమలో మునుగిపోతారు .అయితే సినిమా లో మాత్రం విజువల్స్ ఒక రేంజ్ లో వున్నాయి ఈ సినిమా మొత్తానికి ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యేది విజువల్స్ మాత్రమే అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే కొన్ని  ట్విస్ట్ లు ఉన్నప్పటికీ అవేవి సినిమా ని లేపలేక పోయాయి .భారీ తారాగణం ఉన్నప్పటికీ కూడా వారి పరిధి మేరకే అవకాశం దొరికింది .ఇక దర్శకుడు మాత్రమే కథ ,కథనం లో అనుకున్న ఫలితాన్ని దక్కించుకోలేకపోయాడు .ఇక ప్రభాస్ ,పూజ ల జంట బాగుంది అలాగే వీరి కెమిస్ట్రీ కూడా కొంత మేర పరువాలేదు అనిపించింది .సంగీతం కూడా పరువాలేదు అనిపించింది .

ఫైనల్ : రాదే శ్యాం మొత్తం విజువల్ ట్రీట్ .

రేటింగ్ : 2.5 /5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: