Super Star Mahesh Babu 25th Film Maharshi Movie Usa Premier Collections Report

Super Star Mahesh Babu 25th Film Maharshi Movie Usa Premier Collections Report

Super Star Mahesh Babu 25th Film Maharshi Movie Usa Premier Collections Report

పైడిపల్లి వంశి దర్శకత్వం లో సూపర్ స్టార్  మహేష్ బాబు పూజ ,హెగ్డే ల జంటగా తెరకెక్కిన సినిమా మహర్షి ఈ సినిమా మహేష్ కెరీర్ లో 25 వ సినిమా కావటం తో ఈ సినిమా ను కెరీర్ లో నిలిచిపోయే చిత్రం గా తెరకేక్కించాలి అని చిత్ర యూనిట్ చాల జాగ్రత్తగా పక్క ప్లానింగ్ తో తెరకెక్కించారు ఈంటి ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .అయితే ఈ సినిమా మే 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాల గ్రాండ్ గా విడుదలైంది .ప్రస్తుతం సినిమాలు కూడా ఏమి పోటి లేకపోవటం తో ఈ సినిమా మొదటి రోజు భారీ రికార్డ్స్ సృష్టిస్తుంది అని అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి అయితే సినిమా టాక్ ఎలా వున్నా  మహేష్ బాబు సినిమాలు అంటే us లో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు  ప్రీమియర్స్ ద్వార నే మహేష్ 1 మిలియన్ మార్క్ టచ్ చేయటం గ్యారంటి .మరి తాజాగా అందిన సమాచారం ప్రకారం మహార్హ్సి సినిమా us బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్స్  కలెక్షన్స్ విషయం లో చిత్ర యూనిట్ కి  కొంతవరకు షాక్ ఇచ్చాయి  అని చెప్పవచ్చు .

ఇక విషయానికొస్తే ..మహేష్ బాబు ల్యాండ్ మార్క్ చిత్రం మహర్షి మొదటి రోజు  అమెరికాలో అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది .మహేష్ బాబు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ వుంది ఎలాంటి సినిమా అయినా సరే ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్లను రాబడుతుంది అలాంటిది మహర్షి  అఫ్ మిలియన్ డాలర్ల ($510k )  తోనే సరిపెట్టుకుంది .గతం లో వచ్చిన స్పైడ ర్ ,భారత్ అనే నేను శ్రీమంతుడు వంటి చిత్రాలు ప్రీమియర్స్ తోనే  వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేసాయి అలాంటిది మహేష్ ల్యాండ్ మార్క్ చిత్రం భారీ హైప్ తెచ్చుకున్న చిత్రం మహర్షి మాత్రం ఆఫ్ మిలియన్ తోనే సరిపెట్టుకోవటం చిత్ర యూనిట్ కి కొంత మేరకు షాక్ అనే చెప్పాలి .అందులోను మహేష్ గత చిత్రాల కన్నా ఈ సినిమాని ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేసిన సరే వన్ మిలియన్ ని టచ్ చేయలేకపోయింది .

ఇక ప్రీమియర్స్ విషయం పక్కనపెడితే రానున్న మొదటి వీకెండ్ లో మహర్షి హవా ఏ రేంజ్ లో వుంటుందో చూడాలి అలాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మహర్షి ఫస్ట్ డే ..ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి .

అలాగే ఇప్పటి వరకు ప్రీమియర్స్ ద్వారా అధిక వసూళ్లను సాధించిన టాప్ 10 చిత్రాల్లో మహర్షి లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: