Mahesh Babu Maharshi Movie Review Out Now | Mahesh Babu | Pooja Hegde | Devisri Prasad |

Mahesh Babu Maharshi Movie Review Out Now | Mahesh Babu | Pooja Hegde | Devisri Prasad |

Mahesh Babu Maharshi Out Now :

నటీనటులు : మహేష్ బాబు ,పూజ హెగ్డే ,అల్లరి నరేష్ , జగపతి బాబు ,వెన్నెల కిషోర్ ,జయసుధ  ,ప్రకాష్ రాజ్ తదితరులు
స్క్రీన్ ప్లే మరియు  దర్శకత్వం : వంశి పైడిపల్లి
సంగీత దర్శకత్వం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : అశ్వనిదత్ ,దిల్ రాజు , ప్రసాద్ వి పొట్లూరి ,పరమ్ వి పొట్లూరి
ఛాయాగ్రహణం : కె .యు .మోహన్
రచన : వంశి పైడిపల్లి  ,సాల్మన్ ,హరి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శకుడు వంశి పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం మహర్షి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25 వ చిత్రం కావటం తో ఈ సినిమా చిత్ర యూనిట్ చరిత్రలో నిలిచిపోయే ఒక మైలు రాయి చిత్రం గా తెరకెక్కించాలని చాలా జాగ్రత్త గా పక్కా ప్లానింగ్ తో తెరకెక్కించారు .ఒక ప్రక్క అభిమానుల్లో కూడా ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి అంతేకాకుండా ఈ మహర్షి సినిమా టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అయిన దిల్ రాజు ,అశ్వనిదత్ ,pvp లు కలసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు .దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతం అందించాడు అయితే భారీ అంచనాలు వున్నా ఈ సినిమా మే 9 వ తేదీన అంటే ఈ రోజు న ప్రపంచ వ్యాప్తం గా భారీ అంచనాల నడుమ విడుదలైంది .మరి ఈ సినిమా అందరూ అనుకున్నట్టు గానే అంచనాలు అందుకుండా లేదా అనేది రివ్యూ లో చూద్దాం .

కథ :

రిషి కుమార్ (మహేష్ బాబు ) అనే కుర్రాడు హైదరాబాద్ లో మధ్య తరగతి  కుటుంబానికి చెందిన వ్యక్తీ .అయితే రిషి కుమార్ తండ్రి కొన్ని అనుకోని వైపల్యాలను మరియు అనుమానాలను ఎదుర్కొంటాడు ఇది చూసి రిషి చాలా భాద పడతాడు తను తన తండ్రి లాగా ఇలాంటి సమస్యలు ఎడుర్కొకూడదు ఏ పరిస్తితుల్లో కూడా తన తండ్రి లాగా బ్రతకకూడదు అని అనుకుంటాడు .ఆ తరువాత తను M Tech చదవటానికి వైజాగ్ కాలేజి లో చేరతాడు .ఇక కాలేజి లో చేరిన తరువాత రిషి కి పూజ (పూజ హెగ్డే ), రవి (అల్లరి నరేష్ ) లు పరిచయమ మవుతారు అ పరిచయం కాస్త స్నేహంగా మారి వారి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది .అయితే అనుకోకుండా కొన్ని కారణాల వలన రిషి  వీరి మద్య బందం తెన్చుకుంటాడు ఆ తరువాత్ రిషి చదువు పూర్తీ చేసి తను అనుకున్నది సాధించటం కోసం అమెరికా బయలుదేరతాడు .అమెరికా వెళ్ళిన రిషి తను అనుకున్నట్లు గానే మంచి గ సెటిల్ అవుతాడు ప్రపంచం లోనే గొప్ప కంపెనీ గా పేరున్న ఒక కంపెనీ కి CEO అవుతాడు .అయితే ఒక గొప్ప కంపెనీకి CEO అయిన రిషి అనుకోకుండా గోదావరి జిల్లాలోని రామవరం అనే గ్రామానికి వస్తాడు .రామవరం వచ్చిన రిషి ఒక సమస్య మీద పోరాటం చేయవలసి వస్తుంది .అయితే ఈ పోరాటం ఎవరెవరికి మధ్య జరిగింది ,అసలు రిషి రామవరం గ్రామానికి రావటానికి కారణం ఎవరు ,పూజ , రిషి ఎలా కలుస్తారు అనేది మహర్షి సినిమా కథ.

విశ్లేషణ : 

ఇక మహర్షి సినిమా విషయానికొస్తే ఈ సినిమా మహేష్ బాబు కి 25 సినిమా కాబట్టి ఈ సినిమా ని తన కెరీర్ లో నిలిచిపోయే విధంగా తెరకేక్కించాలి అని చాల జాగ్రత్తలు తీసుకుని పక్కా ప్లానింగ్ తో తెరకెక్కించారు .ఇక దీనికి తగ్గట్టు గానే అభిమానుల్లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కాబట్టి సినిమా లో కూడా మహేష్ బాబు రోల్ అంచనాలకు తగ్గట్టుగానే వుండాలి కాబట్టి రిషి అనే రోల్ మోడల్ పాత్రను ఎన్నుకున్నారు .కాని ఈ పాత్రలో  కూడా ప్రేక్షకుల్లో లోనని సందేశాలు నెలకొన్నాయి .

రిషి అనే మధ్య తరగతి చెందిన ఒక కుర్రాడు అమెరికా వేలలో ఒక పెద్ద కంపెనీ కి సీఈఓ  అవ్వటం ఆ తరువాత ఒక కంపెనీ సీఈఓ అనుకోకుండా గోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి రావటం , ఆ తరువతా రైతు సమస్యల పై పోరాటం చెయ్యటం అనే ఈ మహర్షి కథ మధ్య మధ్య లో మరీ లాంగ్ సన్నివేశాలు తో కూడిన డైలాగ్స్ వుండటం తో ప్రేక్షకులకు కొంత మేరకు బోరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది  అని చెప్పవచ్చు .కాని అక్కడక్కడ మంచి మంచి ఎంగేజింగ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ వీటి ని మించిన స్థాయిలో లాంగ్ సీన్స్ మరియు డైలాగ్స్ వుండటం తో సినిమా కి కొంత ఎఫెక్ట్ తగిలింది అని చెప్పొచు .ఇక ఈ సినిమా ద్వార ఒక మంచి మెసేజ్ ని ఇవ్వాలి అనుకున్నాడు దర్శకుడు పైడిపల్లి వంశి ఈ విషయం లో మెచ్చుకోవచ్చు కాని  కాని సినిమా మొత్తం మెసేజ్ ఇవ్వాలి అనే ప్రయత్నమే కనిపిస్తుంది దాని వలన ప్రేక్షకుడిని అలసిపోయేలా చేస్తుంది అని చెప్పొచు .అందుకే ఏ విషయాన్ని అయిన ఒక పరిమిత వరకు చెబితేనే మంచిది లేదంటే దాని వలన సమస్య ను ఎదుర్కోక తప్పదు .

ఈ సినిమా లో రైతుల సమస్య ల పై రిషి పోరాటం చేసినప్పుడు రైతు యొక్క గొప్పతనాని చెప్పటం లాంటి సన్నివేశాలను బాగా తీర్చిదిద్దాడు వంశి .ఇక ఈ సినిమా లో  మంచి ఎమోషన్స్ సన్నివేశాలు వున్నాయి ,అదే రీతి లో కొంత మేరకు వినోదం కూడా వుంది  దీనికి దీటుగానే వంశి టేకింగ్ అదిరింది కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే సినిమా ను మరో రేంజ్ లో నిలబెట్ట గలిగాయి  ఇంత వరకు బానే వుంది కాని  సమస్యల్లా సినిమా లోని లాంగ్ సన్నివేశాలు మరియు అందులో వచ్చే కొన్ని సన్నివేశాలు గతం లో  వచ్చిన సినిమా ల  సన్నివేశాల  మాదిరి వుండటం తో కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది .మహర్షి సినిమా టైటిల్ కి తగ్గట్టు గానే వుంది కాని ఇదొక కమర్షియల్ జర్నీ లా వుంది .

సాంకేతిక వర్గం :

ఎప్పటిలాగే అదిరిపోయే టేకింగ్ తో దర్శకుడు పైడిపల్లి వంశి అదరగొట్టాడు కొన్ని కథ పరంగా దర్శకుడు వంశి బాగానే తీర్చిదిద్దాడు ,అలాగే ఈ సినిమా కి సంగీతం అనుకున్న స్థాయిలో లేదు అనే చెప్పాలి దేవి శ్రీ గతం లో ఇచ్చిన శ్రీమంతుడు , భారత్ అనే నేను సినిమా లలో సగం వున్నా బాగుండేది అనిపిస్తుంది .ఇక ఈ సినిమా పాటలు కు కూడా సంగీతం అనుకున్న స్థాయి లేదు ఇక సినిమా లో మాత్రం పదా పదా అనే పాటకి మరియు ఇదే కదా ఇదే కదా అనే పాటకి మాత్రం దేవి చాల మంచి సంగీతం ఇచ్చాడు ఇదే రేంజ్ లో అన్ని పాటలకు ఇచ్చి వుంటే సినిమా కూడా మరో రేంజ్ లో వుండేది అని చెప్పొచు ,మోహన్ చాయగ్రహనం కూడా చాల అధ్బుతంగా వుంది అనే చెప్పాలి ఇక నిర్మాణ విలువలు మాత్రం ప్రతి ఫ్రేమ్ కూడా చాల రిచ్ గా అందంగా కనిపించింది .నిర్మాతలు అయితే ఈ సినిమా ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు .

నటీ నటులు :

సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం మూడు పాత్రల్లో అదరగొట్టాడు అయితే అన్నిటికన్నా ఈ సినిమా మహేష్ బాబు కాలేజి పాత్రలో మంచిగా కనిపిస్తాడు అందరిని అలరిస్తాడు .ఇక అలాగే పూజ హెగ్డే పాత్ర కూడా మంచిగానే వుంది ఇక రిషి  స్నేహితుడు రవి పాత్రలో అల్లరి నరేష్ హృదయాలను టచ్ చేసాడు అనే చెప్పాలి అంతా బాగా చేసాడు .ఇక విలన్ పాత్ర లో జగపతి బాబు కూడా బానే చేసాడు ,ఇక ఇలానే ప్రకాష్ రాజ్ ,జయసుధ మరియు రావు రమేష్ లు కూడా ఉన్నంత లో బాగా చేసారు .ఇక వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఒకే అని చెప్పొచ్చు .

రివ్యూ :

ఫైనల్ గా మహర్షి ఒక లాంగ్ జర్నీ

రేటింగ్ :

3 /5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: