iSmart Shankar Movie Review | Ram Potineni | Niddhi Agerwal | Nabha natesh | iSmart Shankar Telugu Review |

iSmart Shankar Movie Review | Ram Potineni | Niddhi Agerwal | Nabha natesh | iSmart Shankar Telugu Review |

iSmart Shankar Movie Review | Ram Potineni | Niddhi Agerwal | Nabha natesh | iSmart Shankar Telugu Review |

ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ

టైటిల్: ఇస్మార్ట్ శంకర్

జానర్ : మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

దర్శకుడు :పూరి జగన్నాధ్

నిర్మాత :ఛార్మి ,పూరి జగన్నాధ్

తారాగణం : రామ్ పోతినేని , నభా నటేష్  ,నిధి అగర్వాల్ ,షాయాజీ షిండే ,ఆశిష్ విద్యార్ధి ,సత్య దేవ్ ,పునీత్ ఇస్సార్ ,గెటప్ శీను ,మధు  తదితరులు

సంగీత దర్శకుడు :మణిశర్మ

సినిమాటోగ్రాఫర్ : రాజ్ తోట

ఎడిటింగ్ : జునైద్ సిద్ధికి

సినిమా నిడివిడి : 140 నిమిషాలు

 

ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని ,స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కంబినేష్ణ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ .ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాల రోజుల నుండి సరైన హిట్ ఒక మంచి హిట్ కోసం అటు రామ్ పోతినేని ,ఇటు పూరి జగన్నాధ్ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు .బద్రి , ఇడియట్ ,అమ్మ నాన్న తమిళ అమ్మాయి ,శివమణి ,పోకిరి ,దేశముదురు ,చిరుత వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ తోపాటు సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ సినిమాల తరువాత ఒక 5 నుండి 6 సంవత్సరాల వరకు ఒక్క హిట్ కూడా లేదు దీనికి కారణం తను తీసిన సినిమా లానే తిప్పితిప్పి తీయటం తో సుమారు 6 సంత్సరాల వరకు పరాజయాల బట పడ్డాడు .కాని ఇంత పరాజయాలు పాలయినప్పటికీ తన ఇమేజ్ తగ్గినప్పటికీ తన మార్క్ మాత్రం క్రేజ్ అలానే వుంది అని చెప్పాలి .ఆ తరువాత వరుస పరాజయాలతో భాద పడుతున్న పూరి కి కొంత కాలానికి టెంపర్ రూపంలో ఒక విజయం దొరికింది ఇది కూడా పూరి కొంత వరకు కోలుకోవటానికి మాత్రమే గాని సరైన హిట్ కాదని తేలిపోయింది .ఈ సినిమా లో కూడా తన రొటీన్ ఫార్ములానే ఉపయోగించాడు కాని కథ కొంత బాగుండటంతో ఒక మాదిరి హిట్ ని అందుకోగలిగాడు ఐతే ఈ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్ కి కలసి వచ్చింది కాని పూరి కి మాత్రం మరల అవే పరాజయాలు .రామేశ్వరం వెళ్ళిన శనిఅవరసం తప్పలేదు అన్నట్టు చివరికి తన కొడుకుతో కూడా సినిమా లు తీసి పరాజయాలు పాలయ్యాడు దీంతో మరల కొంత గ్యాప్ తరువాత ఒక సరికొత్త కాన్సెప్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని ఎనర్జీ టిక్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా ని తెరకెక్కించాడు .ఈ సినిమా తో హిట్ కొట్టాలని కేవలం పూరి జగన్నాధ్ , హీరో రామ్ మాత్రమే కాకుండా అందాల భామలు నిధి అగర్వాల్ ,నాభ నతేష్ లు ఎదురు చూస్తున్నారు .నభా నతేష్ కి ఒక మాదిరి హిట్ లు ఉన్నప్పటికీ తన కెరీర్ మలుపు తిరిగే హిట్ మాత్రం కావాలి అలాగే నిధి అగర్వాల్ ఒక్క హిట్ లేకుండా వరుస పరాజయాలతో సతమతమవుతుంది .కాబట్టి ఈ నలుగురికి ఇస్మర్ట్ శంకర్ మూవీ హిట్ చాలా అవసరం కాదు అత్యవసరం అనేచెప్పాలి .మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మర్ట్ శంకర్ సినిమా చిత్ర యూనిట్ అంచనాలను మరియు ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం ..!

కథ :

శంకర్ (రామ్ పోతినేని  ) అనే కుర్రాడు ఓల్డ్ సిటి లో సెటిల్ మెంట్స్ చేస్తూ వుంటాడు .ఈ నేపధ్యం లో ఒక సెటిల్మెంట్ చేసే విషయం లో శంకర్ కి  చాందిని(నాభ నటేష్ ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది ఈ పరిచయంతో శంకర్ చాందిని తో ప్రేమలో పడతాడు .ఇదే సమయం లో శంకర్ కాశి రెడ్డి అనే ఒక పొలిటికల్ లీడర్ ని చంపిన కేసులో జైలు కి వెళతాడు . ఆ తరువాత శంకర్ జైలు నుంచి తప్పించుకుని వస్తాడు ఇదే సమయం లో  శంకర్ బ్రెయిన్ లో మరో వ్యక్తీ జ్ఞాపకాలను ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు .శంకర్ మెదడు లోకి వేరే వ్యక్తీ జ్ఞాపకాలను ట్రాన్స్ ప్లాంట్ చేసేది సైంటిస్ట్ పింకి (నిధి అగర్వాల్ ) .ఇంతకీ శంకర్ మెదడు లోకి వేరే వ్యక్తీ జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్ ప్లాంట్ చేసారు ,ఇంకా  పొలిటీషియన్ కాశి రెడ్డి ని చంపింది ఎవరు ,అసలు శంకర్ కి సి బి ఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్ ) కి సంబంధం ఏమిటి అనే థ్రిల్లింగ్ విషయాలు తెలుసుకోవాలి అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసి తీరాల్సిందే .

కథనం -విశ్లేషణ :

ఇక ఇస్మార్ట్ శంకర్ కథనం విషయనికొస్తే ట్రైలర్ లో చూసినట్టే హీరో మెదడు లో వేరే వ్యక్తీ జ్ఞాపకాలను ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు .అంటే వేరే వ్యక్తీ జ్ఞాపకాలతో నిండిన ఒక చిప్ ను హీరో తలలో అమరుస్తారు దీంతో హీరో ఒకసారి తనలా ప్రవర్తిస్తాడు కొంత సమయం తరువాత వేరే వ్యక్తిలా ప్రవర్తిస్తాడు .దీనిబట్టే అర్ధమవుతుంది ఈ సినిమా లో కొంత మేర సైంటిఫిక్ థ్రిల్లర్ ని అతికించారు అని .

అవును ఎప్పుడు రొటీన్ కథలను తెరకెక్కించే పూరి ఈ సారి రూట్ మార్చి సైంటిఫిక్ థ్రిల్లర్ ను ఎంచుకున్నాడు .అయితే ఈ థ్రిల్లర్ కు పూరి యెంత వరకు న్యాయం చేయగలిగాడు అనే దాని పై కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి .ఇలాంటి థ్రిల్లర్ ని ఎంచుకునేటప్పుడు అందులో ప్రతి సన్నివేశం లోను లాజిక్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి .మరి ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే లాజిక్ మిస్ అయింది అనే అనుమ అనుమానం కూడా రాకా మారదు .ఒక వ్యక్తీ కి మెమరీ లాస్ అయితే గతాన్ని మరచిపోతారు ఇది అసలు పాయింట్ కాని ఇందులో హీరో జరిగిన విషయాన్నీ 15 నిమిషాల తరువాత మరచిపోతాడు ఇంట వరకు ఒకే కాని  హీరో తలలో రెండు సిమ్ కార్డులు వుండటం వలన హీరో రెండు విధాలుగా ప్రవర్తిస్తుంటాడు .ఒకసారి ఊర మాస స్టైల్ లో శంకర్ ల వుంటే మరో సారి ఇంగ్లీష్ మాట్లాడుతూ సిబిఐ ఆఫీసర్ ల ప్రవర్తిస్తాడు ఇది నటన పరంగా రామ్ బాగానే చేసినప్పటికీ చూసే వారికీ చాల కామెడి గా వుంది అనే చెప్పాలి .కథ పరంగా పూరి మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నప్పటికీ దాని డీల్ చేసే విషయం లో మాత్రం విఫలమయ్యాడు అనే చెప్పాలి .ఎందుకంటే థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులు ఏవేవో వుహించుకుంటారు నిజానికి ప్రేక్షకులు తరువాత ఏం జరగబోతుంది అని తథ్రిల్ ఫీలవుతుంటారు కాని ఈ సినిమా లో అంత థ్రిల్లింగ్ శాన్నివేశాలను ఏమి లేకుండా పూరి మాదిరిగానే సినిమా ని చాల సింపుల్ గా తెరకెక్కించాడు .ఈ సినిమా లో కొంతవరకు థ్రిల్ అయ్యే సన్నివేశం వుంది అంటే అది మర్డర్ సన్నివేశం అనే చెప్పాలి అది కూడా చివరిలో సింపుల్ గా పూరి సినిమా మాదిరిగానే తేలిపోయింది  కాబట్టి ఈ సినిమా కూడా సింపుల్ గానే వుంది .

ఈ సినిమా లో రామ్ నటన మరియు పాత్ర చాల బాగుంది రామ్ మొదటి భాగం లో చాల వినోదం పండిస్తాడు ,అలాగే ఊర మాస గెటప్ లో అదరగొట్టాడు కాని తెలంగాణా యాస లో మాట్లాడటానికి ఇబ్బంది పడినట్లు తెలిసిపోతుంది .అలాగే హీరోయిన్ నభా నటేష్ డైలాగ్స్ కూడా కొంత మేర ఇబ్బంది పెడతాయి .ఇక ఎప్పటిలాగే పూరి మార్క్ డైలాగ్స్ రామ్ నోట నుండి తూటాలు గ పేలాయి . ఈ సినిమా లోని పాటలు వినటానికంటే చూడటానికి చాల బాగున్నాయి అంత బాగా చిత్రీకరించారు .మొదటి భాగంలో వినోదం తో పాటు పూరి మార్క్ డైలాగ్స్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి .ఈ సినిమా లో కొన్ని కొన్ని యాక్షన్ సన్నివేశాలు లో ఒకప్పటి పూరి కనిపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు .కాకపోతే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.

హీరో రామ్ మరియు హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా చాల బాగా వచ్చింది కాని రొమాన్స్ పేరుతొ పూరి కొన్ని మితి మీరిన బూతులు కూడా వాడేసాడు .

దర్శకుడు పూరి జగన్నాధ్ కథ మీద కొంచెం శ్రద్ధ వహించి మంచి లాజిక్ సన్నివేశాలతో సినిమా తెరకెక్కిస్తే సినిమా మరో లెవెలో వుండేది అనటం లో ఎటువంటి సందేహం లేదు .

నటీనటులు :

హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఒదిగిపోయాడు అనే చెప్పాలి .తన ఎనర్జీటిక్ పెర్ఫామెన్స్ కి తోడూ పూరి పంచ్ డైలాగ్స్ తో ధియేటర్ దద్దరిల్లింది అనే చెప్పాలి .అంతేకాకుండా ఈ సినిమా లో రామ్ ఇస్మార్ట్ శంకర్ పాత్రని కొంత మేర వినోదంతో ను మరికొంత మేర మాస్ హీరోఇజం తో వీటితో పాటు డాన్స్ ,రొమాన్స్ లతో కలిపి ఇరగాదీశాడు .ఒక్క మాటలో చెప్పాలంటే పూరి జగన్నాథ్ రామ్ లోని ఫుల్ ఎనర్జీ ని మొత్తం వాడుకున్నాడు అనే చెప్పాలి .

ఇక హీరోయిన్ లు ఈ సినిమా లో తన పాత్రతో పాటు గా అందాల ఆరబోత ప్రదర్శనలో కూడా ఒకరికి ఒకరు పోటీ పది మరీ చేసారు ఇంకా చెప్పలంటే సినిమా వీరి అందాలూ ముఖ్య ఆకర్షణ్ అని చెప్పవచ్చు .

ఇక సత్య దేవ్ ,షియాజీ షిండే ,ఆశిష్ విద్యార్ది వంటి వారు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా చేసారు .

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • హీరో రామ్
  • హీరోయిన్ అందాలూ
  • మణిశర్మ సంగీతం

రామ్ పెర్ఫామెన్స్ : ఇస్మార్ట్ శంకర్ గా రామ్ అదరగొట్టాడు ,హైదరాబాద్ యాస లో అక్కడక్కడ కొంత మేర ఇబ్బంది బడ్డ తన మార్క్ పెర్ఫామెన్స్ తో బాగా అలరించాడు .

హీరోయిన్ లు :

ఈ సినిమా కి మరో ముఖ్య ఆకర్షణ అందాల భామలు నాభ నటేష్ మరియు నిధి అగర్వాల్ అనే చెప్పాలి ఎందుకంటే రామ్ పోతినేని కి మరియు నాభ నటేష్ కి మధ్య కొన్ని రొమాంటి సన్నివేశాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి .

మణిశర్మ సంగీతం :

ఇక ఈ సినిమా కి వెన్నుమక సంగీతం అనే చెప్పాలి .కొన్ని కొన్ని సన్నివేశాలలో మెలోడీ బ్రహ్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే రోమాలు నిక్కపోడుచుకునేలా వుంది అనే చెప్పాలి .ప్రతి సన్నివేశాన్ని  మణిశర్మ తన నేపధ్య సంగీతం తో సినిమాని మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు అనే చెప్పాలి .

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ కమర్షియల్ ఫార్ములా
  • స్క్రీన్ ప్లే

రివ్యూ : ఇస్మార్ట్ శంకర్  ఫైనల్ గా మాస్ కి  ఇస్మార్ట్ – క్లాస్ కి బిస్కెట్

రేటింగ్ : 2.8 /5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: