Vijay Devarakonda Dear Comrade Movie Review in Telugu| Vijay Devarakonda | Rashmika Mandanna | Bharat Kamma |

Vijay Devarakonda Dear Comrade Movie Review in Telugu| Vijay Devarakonda | Rashmika Mandanna | Bharat Kamma |

Vijay Devarakonda Dear Comrade Movie Review in Telugu| Vijay Devarakonda | Rashmika Mandanna | Bharat Kamma |

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ

చిత్రం : డియర్ కామ్రేడ్

నటీనటులు :విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్నా ,ఆనంద్ ,సుహాస్,శృతి రామచంద్రన్ ,సంజయ్ స్వరూప్ ,చారు హసన్ తదితరులు

దర్శకుడు : భరత్ కమ్మా

సంగీత దర్శకుడు : జస్టిన్ ప్రభాకరన్

నిర్మాతలు : యలమంచిలి రవి శంకర్ ,నవీన్ ఎర్నేని ,మోహన్ చెరుకూరి ,యాష్ రంగినేని

ఫోటోగ్రఫీ :సుజీత్ సారంగ్

మాటలు : జయకృష్ణ

పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి ,గీత గోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ లతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు విజయ దేవరకొండ ఇక కొన్ని నెలలు క్రితం వచ్చిన నోటా సినిమా పరాజయం పాలవటంతో తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ తో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు .అయితే ఈ సినిమా లో విజయ్ దేవరకొండ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గీత గోవిందం వంటి బ్లాకు బస్టర్ ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి .ఇక కొత్త దర్శకులతో బ్లాకు బస్టర్ లు అందుకుంటున్న విజయ దేవరకొండ భారత్ కమ్మ వంటి కొత్త దర్శకుడితో మరో హిట్ కొట్టేందుకు డియర్ కామ్రేడ్ గా ఈ రోజు మన ముందుకు వచ్చాడు .అయితే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయినా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు మరియు అభిమానుల అంచనాలను ఎంతవరకు రీచ్ అయిందో టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం .

కథ :

కమ్యూనిస్టు భావాలున్న ఒక కాలేజి కుర్రాడు చైతన్య అలియాస్ బాబి(విజయ్ దేవరకొండ ) అంతేకాదు బాబి కి కోపం చాలా ఎక్కువ అయితే  ఇతడు కాలేజి లో విద్యార్ధుల సంఘాన్ని నడిపిస్తూ ఎప్పుడు గొడవలు పడుతువుంటాడు .బాబి పక్కింటి లో జరుగుతున్న పెళ్ళికి అపర్ణ అలియాస్ లిల్లి (రష్మిక మందన్నా )అనే ఒక అమ్మాయి వస్తుంది .ఆ సందర్భంలో  లిల్లి ని చూసి  న బాబి  ఆకర్షితుడై లిల్లి ప్రేమలో పడతాడు .ఆ తరువాత వారిద్దరూ ప్రేమించుకుంటారు .అయితే బాబి ఎంత వద్దన్నా గొడవలు పడుతూ వుంటాడు దీంతో లిల్లి బాబి నుండి దూరంగా వెళ్ళిపోతుంది .ఇక ఆ తరువాత లిల్లి బాబి ఎలా కలుసుకున్నారు వారిద్దరూ ఎలాంటి ఇబ్భందులు ఎదుర్కొన్నారు తనకు ఎదురైనా సమస్యలను కామ్రేడ్ ఎలా ఎడురించాడు అనేది డియర్ కామ్రేడ్ కథ .

విశ్లేషణ :

డియర్ కామ్రేడ్ సినిమా అంతా మంచిగానే వుంది కాని సినిమా లో ఎదో మిస్ అయింది దర్శకుడు భారత్ కమ్మ కథ విషయంలో రొటీన్ కాకుండా కొంచెం భిన్నంగా వుండే విధంగా మంచి కథను రాసుకున్నాడు కాని ఆ కథను చివరి వరకు తీసుకెళ్లటం లో విఫలమయ్యాడు అనే చెప్పాలి .ఈ సినిమా లో భరత్ కథ తో పాటు గా హీరో హీరోయిన్ ల మధ్య మంచి సన్నివేశాలను రాసుకున్నాడు అలాగే వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చూపించటం లో కూడా చాలా బాగా చూపించగలిగాడు అలాగే ఈ కథకు కావలసిన పాత్రలను కుడా చాలా  చక్కగా ఎంచుకున్నాడు కాని కామ్రేడ్ కథని చివరి వరకు ఒకే విధంగా తీసుకెళ్లటం లో విఫలమయ్యాడు .ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ చాలా స్పష్టం గా కనిపిస్తుంది .అయితే దర్శకుడు భరత్ ఈ సినిమా ని ప్రధమార్ధం లో ఒక లెవెల్ కి తీసుకెళ్ళాడు కాని చివరికి వచ్చేసరికి సగటు దర్శకుడిలా మారిపోయాడు ఒక విధంగా చెప్పాలి .

ఈ  సినిమాలో దర్శకుడు హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే ప్రేమ కథను చాల చక్కగా తెరకెక్కించాడు అంతేకాకుండా  ఎమోషన్ సన్నివేశాలను కుడా చాలా చక్కగా తెరకెక్కించాడు ఇంతవరకు బాగానే వుంది కాని వీటి నుండి దర్శకుడు కమ్యూనిజాన్ని చూపించటం లో కొంత మేర ఇబ్బంది పడ్డాడు .అంతేకాకుండా ఒకేసారి ఒక మంచి ప్రేమ కథను ,కమ్యూనిజాన్ని ,ఒక సదేశాన్ని చూపించాలి అనుకున్నాడు .ఇందులో ప్రేమను చాల చక్కగా చూపించాడు కాని కమ్యూనిజాన్ని మాత్రం సరిగ్గా తీర్చిదిద్దలేకపోయాడు .

ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ కథను చాలా ప్లెజెంట్ గా తీసుకెళ్ళాడు ఈ విషయంలో దర్శకుడి గా  భరత్ ప్రతిభ చాలా బాగా కనిపిస్తుంది రొటీన్ గా కాకుండా న్యాచురల్ ఫీల్ తో అంతా రియల్ స్టొరీ ఫీల్ లో వుంటుంది అయితే ఇలాంటి స్క్రీన్ ప్లే ను మనం ఎక్కువగా మలయాళం సినిమాలో చూస్తూ వుంటాం .ఇక ప్రధమార్ధం లో ప్లెజెంట్ సన్నివేశాలతో నిండిన ఒక మంచి ప్రేమ కథ చాల అధ్బుతంగా వుంటుంది ఇక రెండవ భాగంలో మాత్రం కథ సైడ్ ట్రాక్ పడుతుంది కాని ఇందులో కూడా కొన్ని హృదయానికి తగిలే సన్నివేశాలు కూడా వున్నాయి .హీరో మూడు సంవత్సరాలు అందరికి దూరం మై హీరోహిన్ ను వెతికే సందర్భం లో తన రోడ్డు ప్రయాణంలో తనలో వచ్చే మార్పుని దర్శకుడు భారత్ చాల బాగా తెరకెక్కించాడు .

నటీనటుల  :

విజయ దేవరకొండ గురించి కొట్టగా చెప్పేదేమీ లేదు అందరికి తెలిసిందే కాకపోతే ఈ సినిమా లో విజయ్ నటనలో అక్కడక్కడా అర్జున్ రెడ్డి కనిపిస్తూ వుంటాడు .ఎమోషన్ సన్నివేశాల్లో అయితే ఇక మాటల్లో చెప్పలేం విజయ్ జీవించేసాడు అనే చెప్పాలి ,

ఇక ఈ సినిమా కి ముఖ్య ఆకర్షణ హీరోయిన్ రాష్మిక మందన్నా గీతా గోవిందం సినిమా లో నటన లో  తన ప్రతాపం చూపిస్తే అంతకు మించి ఈ సినిమాలో ప్రాణం పెట్టింది అనే చెప్పాలి ముఖ్యంగా తను ఎదుర్కొనే కొన్ని తీవ్ర మానసిక సంఘర్షణలు అనుభవించే సమయంలో రష్మిక కనిపించదు కేవలం తన పాత్ర మాత్రమే కనిపిస్తుంది .ఈ పాత్ర తన లైఫ్ గుర్తుండిపోయే పాత్ర అవుతుంది .

అలాగే మిగిలిన నటీనటులు కూడా తన పాత్రకు తగ్గట్టుగా చాల బాగా చేసారు .

సాంకేతిక వర్గం :

ఈ సినిమా కి మైత్రి మూవీ మేకర్స్ యొక్క నిర్మాణ విలువలు చల్ బాగున్నాయి సినిమా కి యెంత కావాలో అంత ఇవ్వగలిగారు .అలాగే ఈ సినిమా కి మరో ముఖ్య ఆకర్షణ్ సంగీతం ఈ సినిమా లో ప్రభాకరన్ అందించిన సంగీతం చాలా బాగుంది ప్రతి పాట కి ఒక కొత్త ఫీల్ కలుగుతుంది నేపధ్య సంగీతం లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు ప్రభాకరన్.ఇక అలాగే సుజీత్ సారంగ్ ఛాయాగ్రహణం కుద చాలా బాగుంది సినిమా ని కూల్ గా చాల ప్లెజెంట్ గా చాల అందంగా తెరకెక్కించాడు .ఇక దర్శకుడు కూడా సినిమా కథ సరైనా రీతిలో చుపించాలేకపోయాడు కాని ప్రేమ కథను మాత్రం చాల అద్భుతంగా చూపించగలిగాడు .

చివరిగా :డియర్ కామ్రేడ్ కొంత వరకు ఆకట్టుకుంటుంది

రేటింగ్ :2 .8 /5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: