Bheemla Nayak Movie Review |Pawan Kalayan | Ntya Menon | Rana Daggubati |Samyukta Menon|
Bheemla Nayak Movie Review |Pawan Kalayan | Ntya Menon | Rana Daggubati |Samyukta Menon|
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ తో పాటు చాల మంది సెలబ్రిటీలకు కు పెద్ద పండగ అనే చెప్పాలి ఎందుకంటే పవన్ క్రేజ్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి వాడు అయితే సాగర్ కే చంద్ర దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరో గా నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్ ఈ సినిమా ని నాగ వంశి సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించటం జరిగింది .అయితే ఈ చిత్రం వాస్తవానికి సంక్రాంతికి విడుదల కావాలి కాని కోవిడ్ కారణంగా సినిమా వాయిదా పడింది .అయితే ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర యూనిట్ నుండి సరైన నిర్ణయం రాకపోవటంతో సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అనే ఆందోళన లో వున్నారు అభిమానులు .అయితే మొత్తానికి వీటన్నింటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ విడుదల తేదీ ప్రకించటం ఆపై pre రిలీజ్ ఈవెంట్ నిర్ణయించటం అన్ని చక చక జరిగిపోయింది .ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు విడుదల కాబోతుంది .ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం .
చిత్రం : భీమ్లా నాయక్
నటీనటులు : పవన్ కళ్యాణ్ ,రానా దగ్గుబాటి ,నిత్యమీనన్ ,సంయుక్త మీనన్ ,సముద్ర ఖని ,రావు రమేష్ ,తనికెళ్ళ భరణి,రఘుబ్బు తదితరులు
కథ : సాచి
మాటలు ,స్క్రీన్ ప్లే : త్రివిక్రం శ్రీనివాస్
ఛాయాగ్రహణం : రవి చంద్రన్
నిర్మాత : సూర్య దేవర నాగ వంశి
దర్శకత్వం : సాగర్ కె చంద్ర
కథ :
ఈ సినిమా కథ విషయానికొస్తే నిజాయితీ ,నిబద్ధత సహాయం చేసే గుణం ఇవన్ని గుణాలు వున్న ఆత్మ గౌరవాన్ని నమ్ముకున్న ఒక పోలీస్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాన్ ) కి, మాజీ MP కొడుకు అహంకారమే ఆయుధంగా కనిపించినటువంటి డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి )కి మధ్య జరిగే రసవత్త పోరే ఈ భీమ్లా నాయక్ సినిమా.అయితే నిజయితి గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ కి అహంకారం తో వున్నా డానియల్ ఎలా దొరికాడు ఆ తరువాత డానియల్ భీమ్లా నాయక్ పై ఎలాంటి ప్రభావం చూపించాడు చివరికి వీరిద్దరి మధ్య యుద్ధం ఎ స్తాయికి చేరుకుంది అనేది భీమ్లా నాయక్ సినిమా .
విశ్లేషణ:
ఈ సినిమాను మలయాళం మూవీ అయ్యప్పనుం కోషియం కు రీమేక్ గా తెరకెక్కించారు అయితే ఆ సినిమా మలయాళం ప్రేక్షకులకు తగ్గట్టుగా చాలా క్లాసిక్ గా వుంటుంది మరి భీమ్లా నాయక్ మన telugu ప్రేక్షకులకు తగ్గట్టుగా చాలా మాస్ గా వుంటుంది అయితే ఈ సినిమా కథ చెప్పటానికి ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు అయినా కాని దాని యొక్క కథనాన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు సాగర్ చంద్ర .అయ్యర్ ,అప్పట్లో ఒకడు ఉండేవాడు వంటి చిత్రాలు తీసిన చిన్న దర్శకుడు పవన్ కళ్యాణ్ సినిమా అందులోను మాస్ ఎలిమెంట్స్ ను ఎలా తెరకేక్కిస్తాడా అనుకున్న వాళ్ళందరి అంచనాలను మించేలా చాలా జాగ్రత్తగా తీసాడు దర్శకుడు సాగర్ .ఇక త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ,మాటలు అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు ,ఈ సినిమా కి ప్రధాన బలం తమన్ నేపధ్య సంగీతం అనటంలో ఎటువంటి సందేహం లేదు అడవి సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం అయితే అసలు అదిరిపోయింది అంతే.దానికి తోడూ తమన్ సమకూర్చిన పాటలు కూడా చాలా బాగా రావటం జరిగింది .ఇక ఈ సినిమా మరొక ప్రధాన బలం రవిచంద్రన్ కెమెరా పనితనం సినిమా వేరే లెవెల్ కి తీసుకెళ్లటం జరిగింది .
నటీనటులు :
ఇక పవన్ రానా ల విషయానికొస్తే ఒకరిని మించి మరొకరు అన్నట్లు చేసారు అలాగే వీరికి జంటగా నటించిన నిత్య మీనన్ ,సంయుక్త మీనన్ లు కూడా వారి పరిధి తగ్గట్లు చాలా బాగా చేసారు .ఇక సముద్ర ఖని పాత్ర మాత్రం చాలా బాగా చేసాడు రావు రమేష్ పాతర కూడా బాగుంది ఇక మిగత వారందరూ వారి పరిధి తగిన విధంగా చాలా బాగా నటించారు .
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ ,రాణాల నటన
పవన్ ,రాణాల మధ్య వచ్చే ఫైట్స్
నేపధ్య సంగీతం
కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ సాగదీత అనిపించే రెండు మూడు సన్నివేశాలు
ఫైనల్ గా: భీమ్లా నాయక్ మహా శివరాత్రికి మాస జాతర
రేటింగ్ : 3.5/5