Actress Dimple Hayathi Catch Me Song Review | Khiladi | Raviteja | Telugu Actress |

Actress Dimple Hayathi Catch Me Song Review | Khiladi | Raviteja | Telugu Actress |

Actress Dimple Hayathi Catch Me Song Review | Khiladi | Raviteja | Telugu Actress |

మాస్ మహారాజ్ రవితేజ , డింపుల్ హయతి కాంబినేషన్ లో తెరకెక్కిన ఖిలాడి సినిమా ఈ నెల 11 న విడుదలకి సిద్ధమవుతుంది .అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో  జోరు పెంచింది .అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే 4 పాటలు విడుదల అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు  ప్రేక్షకులను మంచిగా ఆకట్టుకున్నాయి .అయితే ఇప్పుడు ఈ సినిమా లో 5 వ పాట ని కొద్ది నిమిషాల క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది .ఈ పాట ఎలా వుంది అనేది ఒక చిన్న రివ్యూ లో చూద్దాం ..!

ఈ పాట విషయానికొస్తే …
హలో మిస్టర్ మాచో మెన్
నాతో కొంచెం నాచో మెన్
నాటీ డేట్ పూచో మెన్
మిసైతే రాదు సోచో మెన్
రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్  హుడై రారా  సూపర్ మెన్
విస్కీ లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు
మా స్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మెన్
కేచ్ మి కేచ్ మి కేచ్ మి ఇఫ్ యు కెన్
టీచ్ మి టీచ్ మి టీచ్ మి వాట్ యు కెన్

అంటూ సాగే ఈ పాట ఒక రేంజ్ లో వుంది ..ఈ పాట కి రవితేజ ,డింపుల్ డాన్స్ ఒక ఎత్తు అయితే దేవిశ్రీ మ్యూజిక్ మరో మ్యాజిక్ అనే చెప్పాలి.

హీరోయిన్ డింపుల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ : 

హీరోయిన్ డింపుల్ విషయానికొస్తే తన కలర్ ని పక్కన పెట్టి కంటెంట్ ని నమ్ముకుని తన సత్తా చాటుకుంటుంది .అసలు డింపుల్ ప్రేక్షకుల కు పరిచయం అయింది తన డాన్స్ తోనే వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమా లో జరా జరా సాంగ్ కి అదిరిపోయే స్టెప్పు లేసి అందరిని కట్టిపడేసింది .మరి ఆ డాన్స్ చూసి డింపుల్ కి  ఐటెం సాంగ్ చేయటానికి చాలా అవకాశాలే వచ్చిన హీరోయిన్ గా ఎదగాలి అనే ఉద్దేశ్యం తో  వాటిని వదులుకుంది .ఇక డింపుల్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది డాన్స్ అన్నట్టు ప్రేక్షకుల్లో ముద్ర వేసుకుంది .మరి అలాంటి డింపుల్ మాస్ మహారాజ్ తో హై వోల్టేజ్ సాంగ్ కి డాన్స్ వేస్తె ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవచ్చు .కేచ్ మి కేచ్ మి నే లిరిక్స్ వద్ద ఈ అమ్మడు వేసే స్టెప్పులు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి .అలాగే మధ్యలో వచ్చే మ్యూజిక్ లో తన నడుము ని రింగు లా తిప్పుతూ మత్తెక్కించే స్టేప్పుల తో కట్టిపడేసింది .ఈ సాంగ్ లో డింపుల్ డాన్స్ తో పాటు డింపుల్ అందాలూ  కూడా అదుర్స్ .ఒక్క మాటలో చెప్పాలి అంటే  ఈ సాంగ్ లో డింపుల్ డాన్స్ అన్ స్టాప్ బుల్  అనే చెప్పాలి. తన డాన్స్ తగ్గట్టు గానే తన అందాలను కుడా అదిరిపోయే రేంజ్ లో చూపిస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుంది .

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ :

ఈ సినిమా లో కొన్ని పాటలకు దేవి శ్రీ మ్యూజిక్ రొటీన్ గానే వుంది కాని ఈ సాంగ్ లో మాత్రం పూర్తీ గా రొటీన్ కి భిన్నంగా సరికొత్త ట్యూన్స్ తో దేవి దుమ్ము లేపాడు .పాట ప్రారంభం నుండే మ్యూజిక్ దెబ్బకి బాడీ లో గూస్ బంప్స్ రావటం ఖాయం మ్యూజిక్ కుడా చాలా ఫ్రెష్ గా వుంది .అందులోను ఈ పాటకి శ్రీ మని అందించిన లిరిక్స్ కూడా అదుర్స్ ముఖ్యంగా లిరిక్స్ కి తగ్గ మ్యూజిక్ ఈ కేచ్ మి పాట .అలాగే ఈ పాట కి  Neha Bhasin & Jaspreet Jasz ల గొంతు తోడవటం తో సాంగ్ ఫుల్ రాక్ అన్నట్లు వుంది .

ఫైనల్ గా ఈ పాట సినిమా కే హైలెట్ అవబోతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: