Actress Amala Paul Aame Movie Review

Actress Amala Paul Aame Movie Review

Actress Amala Paul Aame Movie Review

అమలపాల్ హీరోయిన్ గా తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆమె ఎన్నో వివాదాల మధ్య ఈ రోజు విడుదలైంది .ఆమె సినిమా పై మొదట అంతగా అంచనాలు లేకపోయినా రాను రాణి సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి .ఆమె మూవీ ఫస్ట్ లుక్ చూసి ఒకే అనుకున్నా గాని ఈ సినిమా టీజర్ చుసిన వాళ్ళు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు .దానికి కారణమా హీరోయిన్ అమలపాల్ నగ్న ప్రదర్శన అని చెప్పాలి .ఈ సినిమా లో అమల పాల్ చాల సేపు నగ్నంగా నటించింది .ఈ సినిమా కుస్ సంబందించిన టీజర్ లో అమలపాల్ నగ్న ప్రదర్శన్ చూసి అందరూ షాక్ అయ్యారు .ఇలాంటివి బాలీవుడ్ వరకు ఒకే కాని ఇప్పటి వరకు తెలుగు తమిళ్ లో ఎవరు చేయలేదు అందుకే ప్రేక్షకులు షాక్ గురవటమే కాకుండా ఈ సినిమా లో అమలపాల్ ఎలా నటించింది .అసలు అమలపాల్ నగ్నంగా ఎంతసేపు నటించింది ,ఈ సినిమా స్టొరీ ఎలా ఉండ బోతుంది అనే ఆసక్తికర చర్చలు ప్రేక్షకుల్లో జరుగుతున్నాయి .అందుకే ఈ సినిమా కోసం చాల మంది ప్రేక్షకులు కంటిమీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు .ఈ సినిమా తమిళం లో ఆడై పేరుతొ విడుదల కాగా తెలుగు లో ఆమె పేరుతొ తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేసారు .

మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను యెంత వరకు రీచ్ అయింది ఈ సినిమా ఎలా వుంది ,ఈ సినిమా లో అమలపాల్ ఎలా నటించింది అనే విషయలు టుడే టాకీస్ రివ్యూ లో చూద్దాం .

ఆమె మూవీ రివ్యూ :

నటులు : అమలపాల్

సంగీతం : ప్రదీప్ కుమార్ ,ఊర్క

ఫోటోగ్రఫీ : విజయ్ కార్తిక్ ఖన్నాన్

దర్శకుడు : రత్నకుమార్

నిర్మాతలు:  విజయ్ మొరవనేని ,రాంబాబు  కల్లూరి

కథ :

స్వతంత్ర భావాలు ,ఆత్మా విశ్వాసం కలిగిన కామిని అనే అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీ లో ఫ్రాంక్ వీడియో లు చేస్తూ వుంటుంది .అయితే తను పని చేస్తున్న ఆఫీస్ ను అక్కడి నుండి వేరే చోటు మార్చాలని ఆ కంపెనీ యాజమాన్యం నిర్ణయిస్తుంది .ఈ నేపథ్యం లో పాత ఆఫీస్ ని విడిచి వెళ్ళిపోతున్నాము కాబట్టి ఈ రాత్రికి పార్టీ చేసుకుందాం అని కామిని ఫ్రెండ్స్ భావిస్తారు .దీంతో ఆ రాత్రికి ప్రతి జరుగుతుంది ఈ పార్టీ లో అర్ధరాత్రి జరుగుతున్నా ఈ పార్టీ లో కామిని కూడా పాల్గొంటుంది .అంతే ఇక తెల్లారిన తరువాత చుస్తే బట్టలు లేకుండా కామిని ఆ బిల్డింగ్ లో పది వుంటుంది .ఇంతకీ ఆ రాత్రి ఏమి జరిగింది ,అసలు కామిని ఆ పరిస్తితుల్లో ఉండటానికి కారణం ఎవరు,ఈ పరిస్థితుల నుండి కామిని ఎలా తప్పించుకుంది అనే విషయలు తెలియాలంటే సినిమా చూడాలి మరి .

విశ్లేషణ :

ఆమె కథను మొత్తం టీజర్ లోనే చూపించేశారు కాకపోతే మనం అందులో ఏమి జరుగుతుంది అనేది మనం ఊహించలేం .ఆమె సినిమా కథ చాలా కొత్తగా వుంది అనే చెప్పాలి ఇప్పటి వరకు ఇలాంటి కథతో కూడిన సినిమా లు అసలు రాలేదు .సినిమా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్ ఫీలవుతాం .అసలు ఇలాంటి కథను చేయటం హీరోయిన్ అమలపాల్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే .ఇక ఈ సినిమా మొదటి భాగానికి వస్తే కొంత నెమ్మదిగా వుంటుంది అసలు స్టొరీ ఏమిటి అనేది కూడా అర్ధం కాదు ఇక రాను రాను రెండవ భాగం వచ్చేసరికి దర్శకుడు కథలోకి తీసుకు వెళతాడు .రెండవ భాగం దాదాపుగా అంతా థ్రిల్లింగ్ గానే వుంటుంది .ఇక అమలపాల్ విషయానికొస్తే రెండవ భాగం లో అంతా చాలా సేపు నగ్నంగానే కనిపిస్తుంది .అమలపాల్ నగ్న ప్రదర్శనకు తగ్గట్టుగానే తన బాడీ లాంగ్వేజ్ కి తగిన నటనతో అద్భుతం గా నటించింది .ఈ సినిమా లో ఇంటర్వెల్ సన్నివేశం కూడా దర్శకుడు రత్నకుమార్ చాల బాగా తెరేక్కించాడు .రెండవ భాగం లో ప్రతి సన్నివేశం కూడా చాలా ఉత్కంట భరితంగా వుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు .ఇక ఆమె సినిమా మొత్తం అమలపాల్ వన్ మెన్ షో అనే చెప్పాలి .

ఇక ఈ సినిమాలో దర్శకుడు రత్న కుమార్ అమ్మాయిల  స్వేచ్చ కు సంబందించిన  విషయాలను చాల బాగా వివరించాడు చివరిగా ఒక మంచి మెసేజ్ ని ఇచ్చాడు .అంతేకాకుండా ఒక సరికొత్త ప్రయోగం తో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి .సినిమా ని మొత్తం ఒక్క అమలపాల్ తోనే మరో లెవెల్ కి తీసుకెళ్ళిన తీరు చాల బాగుంది అలాగే ఈ కథ వాస్తవానికి చాలా దగ్గర వుండేటట్టు చాల బాగా తెరక్కించాడు .

ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు ప్రదీప్ కుమార్ కూడా కథకి తగ్గట్టుగా  మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు అలాగే ఫోటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కూడా అమలపాల్ నగ్న సన్నివేశాలను ఎక్కడ అశ్లీలంగా లేకుండా చాల బాగా తెరకెక్కించాడు .

ప్లస్ పాయింట్స్ :

అమలపాల్ నటన

దర్శకత్వం

కథ

మైనస్ పాయింట్స్ :

కథ నిదివిడి

ఫస్ట్ హాఫ్

రివ్యూ : ఫైనల్ గా ఆమె అమలపాల్ థ్రిల్లింగ్ చేస్తుంది

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: