Terrorist Entry Makes High Alert in Andhra Pradesh

Terrorist Entry Makes High Alert in Andhra Pradesh

Terrorist Entry Makes High Alert in Andhra Pradesh

Terrorist Entry Makes High Alert in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోకి చొరబడ్డ తీవ్ర వాదులు ,ఆందోళనలో ప్రజలు .ఓడరేవులే తీవ్రవాదులకు ముఖ్య టార్గెట్

పూర్తీ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోకి సముద్ర మార్గం గుండా తీవ్ర వాదులు ప్రవేశించారు అని ఎపి పోలీస్ లకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది .సమాచారం అందుకున్న పోలీస్ లు వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు .తీవ్ర వాదులు ఓడరేవులను ముఖ్య టార్గెట్ చేసారు అనే సమాచారం తో ఎపి పోలీస్ లు తీర ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేసారు .అలాగే లాడ్జ్ లలోను మరియు ఆయా ప్రాంతాలలో కూడా భద్రతలు కట్టు దిట్టం చేయటంతో పాటు  ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు .ఇక హోటల్ ,మరియు లాడ్జ్ లలోకి కూడా ఎవరైనా కొత్త వారు ప్రవేశిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యానికి సూచించారు .

తాజాగా అందిన సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం కు చెందిన పన్న పూడి పాత వూరు దగ్గరలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు ఒక పడవ లభ్యమయింది ఆ పడవ మీద శ్రీలంక అని పేరు వుంది దీంతో వెంటనే స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు .దీనిబట్టి చుస్తే శ్రీలంకలో అనుబంధ సంస్థగా వున్నా నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్ర వాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఈ దాడి లో సుమారు ౩౦౦ వందల మందిని చంపేశారు .దీని బట్టి చుస్తే ఆ సంస్థ వాళ్ళే ఈ పడవ ద్వారా ప్రవేశించి వుంటారు అని నిఘా వర్గాలు హెచ్చరించాయి .దీంతో ఎపి లో పోలీస్ లు అన్ని చోట్ల భద్రతలను కట్టుదిట్టం చేసారు .

Leave a Reply

Top
%d bloggers like this: