Taxiwala Movie Review | Rating | Vijay Devarakonda | Priyanka Jawlkar |

Taxiwala Movie Review

Taxiwala Movie Review | Rating | Vijay Devarakonda | Priyanka Jawlkar |

Taxiwala Movie Review | Rating | Vijay Devarakonda | Priyanka Jawlkar |

Taxiwala Movie Review

పెళ్లి చూపులు సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుని ,అర్జున్ రెడ్డి సినిమా తో రౌడీ గా క్రేజ్ సంపాదించుకుని గీత గోవిందం సినిమా తో స్టార్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా తరువాత భారీ అంచనాల నడుమ విడుదలైనా నోటా సినిమా సరైనా ఫలితాన్ని అందించలేకపోయింది దీంతో విజయ్ కి బ్రేక్ పడే వార్నింగ్ ఇచ్చింది ఆ సినిమా అయితే నోటా సినిమా వచ్చిన రెండు నెలల లోపే మరో సినిమా ను దించాడు విజయ్ అయితే వాస్తవానికి టాక్సీ వాలా సినిమా నోటా సినిమా కంటే ముందు రవళి కాని కొన్ని కారణాల వలన ఆ సినిమా విడుదల కాలేదు ఇదిలా వుంటే టాక్సీ వాలా సినిమా విడుదలకు ముందే యు ట్యూబ్ లో దర్శనమివ్వటం తో ఈ సినిమా యూనిట్ అంతా చాలా కంగారుపడ్డారు . ఇలాంటి పరిస్తితుల్లో ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి విజయ్ దేవర కొండ టాక్సీ వాలా సినిమా ఎలా వుందో ఒక చిన్న రివ్యూ లో చూద్దాం ….

నటీనటులు:

విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మధు నందన్ , మాళవిక నాయర్,విష్ణు ,యమునా, రవి వర్మ ,సిజ్జు ,కళ్యాణి ,రవి ప్రకాష్ ,చంమాక్ చంద్ర , ఉత్తేజ్ తదితరులు

స్క్రీన్ ప్లే ,మాటలు : సాయి కుమార్ రెడ్డి

కథ,దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యాన్

సంగీతం: జేక్స్ బిజోయ్

నిర్మాత : ఎస్ కె ఎన్

సినిమాటోగ్రఫి :  సుజిత్ సారంగ్

Taxiwala Movie Review

కథ:

ఐదేళ్ళు కష్టపడి డిగ్రీ పూర్తీ చేసినా శివ (విజయ్ దేవరకొండ ) అనే కుర్రాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వస్తాడు హైదరాబాద్ కి వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వుంటాడు వీటన్నిటికంటే క్యాబ్ డ్రైవింగ్ బెటర్ అని భావించి ఒక క్యాబ్ కొనుకుంటాడు అయితే తన దగ్గర వున్నా డబ్బులకు పాత కాలం నాటి కారు మాత్రమే వస్తుంది .అయితే ఆ కారుని మంచిగా చేయించుకుని క్యాబ్ సర్విస్ మొదలుపెడతాడు శివ అంతేకాకుండా ఈ కారు కొన్న తరువాత శివ అన్ని కలసివస్తాయి కాని కొన్ని రోజుల తరువతా అనుకోకుండా ఆ కారులో దెయ్యం వుంది అనే విషయం శివ తెలుసుకుంటాడు .అసలు ఆ కారులో దెయ్యం వుందా వుంటే ఆ దెయ్యానికి కారుకి సంబంధం ఏమిటి ,ఆ దెయ్యాన్ని శివ ఏం చేసాడు అన్నదే టాక్సీ వాలా కథ

విశ్లేషణ :

అయితే ఇప్పటికే చాలా హర్రర్ కామెడి చిత్రాలు ,మరియు థ్రిల్లర్ సైన్టిపిక్ సినిమా లు చాలా వచ్చేసాయి ఎన్ని వచ్చినా అందులో కొన్ని మాత్రమే హిట్ సాధించాయి దానికి కారణం కథ అందుకే ఎన్ని సినిమా లు వచ్చిన దర్శకుడు రాహుల్ మాత్రం ఈ సినిమా కథను నమ్ముకుని తెరకెక్కించాడు .ఈ హర్రర్ కథ కు కొంచెం కామెడి కుడా తగిలించాడు ఈ కథని దర్శకుడు  రాహుల్ కొత్త రైటర్ సాయి కుమార్ సహాయం తో న్యాచురల్ కామెడి తో కూడినా హర్రర్ థ్రిల్లర్ ను కొంచెం సైంట్ఫిక్ జోనర్ కుడా టచ్ చేసి కొంచెం కొత్తగా ఆవిష్కరించాడు .ఈ సినిమా లో హర్రర్ , థ్రిల్లర్ లతో పాటు కామెడి మరియు కొంత సైంట్ ఫిక్ విధానం వుండటం తో సినిమా ఎక్కడ బోరుకొట్టకుండా వెళ్ళిపోతుంది .దర్శకుడు రాహుల్ సినిమా ని ఎక్కడ పక్కదోవ పట్టించకుండా తన అనుకున్న కథ ని చాలా క్లియర్ చూపించాడు .

ఇక కారులో దెయ్యం అనే కాన్సెప్ట్ తో నడుస్తుంది టాక్సీ వాలా సినిమా కాని ఇలాంటి కారులో దెయ్యం వుండే సినిమా లో హాలీవుడ్ లోను మరియు తెలుగులో కూడా ఒకటి రెండు వచ్చాయి అయితే టాక్సీ వాలా ట్రైలర్ చూడగానే కారులో దెయ్యం వుంది ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అనేది అందరికి అర్ధమైపోయింది దీంతో కారులో దెయ్యం అనేది కొత్త కాన్సెప్ట్ ఏమి కాదు అని అనుకున్నారు అంతా ఇక ఈ సినిమా చూస్తున్నప్పుడు కుడా అదే ఫీలింగ్ ఎవరో ఆత్మ కారులో ప్రవేశించి తన ను చంపినా వారిపై ప్రతీకారం తీర్చుకోవటం అనేది పాత కథ లానే అనిపిస్తుంది కాని అలా కొంత సేపు కథ నడుస్తుండగా కథలో ఎవరు ఊహించని ఒక కొత్త లాజిక్ ని తీసుకున్నారు ఈ లాజిక్ సినిమా కు ప్రాణం పోసింది .ఆస్ట్రాల్ ప్రాజిక్షన్ అనే ఒక కొత్త లాజిక్ ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది , ప్రేక్షకుల్లో తరువాత ఏమి జరుగుతుంది అనే ఆసక్తి ని పెంచుతుంది .ఇక ఈ సినిమా కి మరో ముఖ్య ఆకర్షణ కామెడి …

ఈ సినిమా లో కామెడి అన్ని సినిమా ల్లగా ఏదో పెట్టినట్టు కాకుండా చాలా న్యాచురల్ గా వుంటుంది .టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ దేవర కొండా చెప్పినట్టు పెళ్లి చూపులు సినిమా లో ప్రియ దర్శి , అర్జున్ రెడ్డి సినిమా లో రామ కృష్ణ తరహ లో కొత్త కమెడియన్ విష్ణు టాక్సీ వాలా సినిమా కి మరో ఎసెట్ గా నిలిచాడు .ఇక టాక్సీ వాలా సినిమా ప్రదమార్ధం అంతా చాలా ఆసక్తికరం గా సాగుతుంది , ద్వితియార్ధం కొంచెం స్లో అయినప్పటికీ సీరియస్ గా సాగుతూ చివరికి మరల పుంజుకుంటుంది  .అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో హరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కుడా చాల మంచిగా అనిపిస్తాయి ఇక మాటే వినడుగా పాట సినిమా కి హై లెట్ గా నిలుస్తుంది .

సాంకేతిక వర్గం :

టాక్సీ వాలా సినిమా కి టెక్నిషియన్స్ అందరూ న్యాయం చేసారు .సుజీత్ సారంగ్ ఫోటోగ్రఫీ సినిమా కు మరో ప్లస్ పాయింట్ ఇక సంగీత దర్శకుడు జెక్ బిజోయ్ కుడా తన నేపధ్య సంగీతం తో సినిమా ని మరో లెవెల్ కి తీసుకువెళ్ళాడు ఇక మాటే వినదుగా సాంగ్ అయితే చాలా బాగుంటుంది .ఈ సినిమా నిర్మాణ విలువలు కుడా బాగున్నాయి .ఇక ఈ సినిమా రైటర్ సాయి కుమార్ డైలాగ్స్ తో పాటు ఆసక్తి కరమైన స్క్రీన్ ప్లే తో తన సత్తాను చాటుకున్నాడు .దర్శకుడు రాహుల్ ఈ సినిమా కథ ను చాలా బాగా డీల్ చేయ్యగాలిగాడు .

చివరిగా : ఈ టాక్సీ వాలా లో జర్నీ చెయ్యొచ్చు

రేటింగ్ : 3.1 /5

Taxiwala Trailer Watch Here:

Ileana Hot Video Click Here: https://youtu.be/c7KC14QCgZ4

 

Leave a Reply

Top
%d bloggers like this: