Sarkar Movie Review Telugu | Vijay | Keerthy Suresh | Varalakshmi SarathKumar | AR Muruga Doss | AR Rahman |

Sarkar Movie Review

Sarkar Movie Review Telugu | Vijay | Keerthy Suresh | Varalakshmi SarathKumar | AR Muruga Doss | AR Rahman |

Sarkar Movie Review Telugu :

విజయ్ ,మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం సర్కార్ దీపావళి కానుకగా  ప్రపంచ వ్యాప్తం గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .మురుగదాస్ , విజయ్ ల కాంబినేషన్ లో ఈ చిత్రం మూడో చిత్రం కావటం తో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ సాధించటం తో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి .తమిళం, కేరళ లలో ఈ సినిమా కి మంచి ప్రమోషన్స్ చేసినప్పటికీ తెలుగులో మాత్రం ఎటువంటి ప్రమోషన్ చెయ్యలేదు అసలు విజయ్ సినిమావస్తుంది అనే విషయమే ఎవరికి తెలియలేదు అన్నట్టు వుంది తెలుగు లో కూడా భారీ ప్రమోషన్స్ చేసి వుంటే సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి అంతం లో ఎటువంటి సందేహం లేదు .భారీ అంచనాల నడుమ విడుదలయిన సర్కార్ సినిమా  విజయ్ అభిమానుల అంచన్లను ఎంతవరకు న్యాయం చేసింది తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు అలరిస్తుంది అనేది సర్కార్  రివ్యూ లో  చూద్దాం .

Sarkar Movie Review

నటీ నటులు : విజయ్ , కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రాధా రవి ,యోగి బాబు ,పాల కరుపయ్య తదితరులు .

ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరాన్

సంగీతం :ఎ ఆర్ రెహమాన్

దర్శకత్వం : మురుగదాస్

కథ :

ప్రపంచం లోనే నెంబర్ వాన్ కంపెనీ గా పేరున్న ఒక పెద్ద కంపెనీ సి ఇ ఓ సుందర్ స్వామి .సుందర్ స్వామి తన జీవితం లో జరిగిన తన తండ్రి మరణం కారణంగా ఓటు హక్కు కు చాల విలువ ఇస్తాడు .అయితే సుందర్ రామస్వామి ఎన్నికల సందర్భం లో తన ఓటు వేయటానికి అమెరికా నుండి అంధ్ర ప్రదేశ్ కు వస్తాడు .అయితే తీర ఇక్కడకు వచ్చిన తరువాత తన ఓటు ను ఎవరో దొంగ ఓటు వేసారు అని తెలుస్తుంది .దీంతో సుందర్ స్వామి తన ఓటు హక్కు దక్కించుకోవటానికి కోర్టు వెళతాడు అయితే ఈ సమస్య తీరే వరకు ఎన్నికల ఫలితాలను వాయిదా వేయమని కోర్టు ప్రకటిస్తుంది .దీంతో ఇలాంటి ఓటు హక్కు బాధితులు చాల మంది బయటకు రావటం తో ఎన్నికలు నిలిపి వేసి మరలు ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆదేశిస్తుంది అప్పుడు ఓటు హక్కు పై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు సుందర్  .దీంతో అధికార పార్టీ వారికి కోపం వస్తుంది దీంతో వారు సుందరను టచ్ చేయటం తో సుందర్ ఏకంగా ముఖ్యమంత్రి మీదకే పోటీకి దిగుతాడు .ఈ నేపధ్యం లో  సుందర్ అధికార పార్టీ ని ఎలా ఎదుర్కొన్నాడు ,వారి పై సుందర్ గెలిచాడ లేదా అన్నదే సర్కార్ సినిమా మిగతా కథ .

విశ్లేషణ :

ఇక సర్కార్ సినిమా కథ విషయానికొస్తే కథ కొత్తగా ఉన్నప్పటికీ ఈ సినిమా లో కథనం పట్టు కోల్పోయింది అని చెప్పొచ్చు .మురుగదాస్ గత చిత్రాల్లో చూసుకుంటే కథ తో పాటు కథనం లో కూడా మంచి గ్రిప్ వుంటుంది .మురుగదాస్ కథ పై మంచి గా ద్రుష్టి పెట్టినప్పటికీ కథనాన్ని పక్కన పెట్టి విజయ్ హీరో ఇజం పై ద్రుష్టి పెట్టాడు అని చెప్పొచ్చు .దీంతో ఈ సినిమా లో ఆసక్తి కరంగా సాగే సన్నివేశాలు లేకపోవటం తో సినిమా సాధరణంగా నే వుంది అనిపిసుంది .కొన్ని సన్నివేశాల్లో మాత్రం మురుగదాస్ తన మార్క్ ని చూపించినప్పటికీ సినిమా ని తనదైనా శైలి లి తీసుకురాలేకపోయాడు .అయితే మురుగదాస్ అనగానే ముఖ్యం గా గుర్తుకొచ్చేది లాజిక్ మరియు రీజనబుల్ సీన్స్ ఈ సినిమా లో అవేమి లేకుండా సినిమా మొత్తం సినిమాటిక్ గానే సాగిపోయింది .ప్రపంచం లోనే నెంబర్ వన్ కంపెని CEO తన ఓటు వేయటానికి ఇండియా రావటం తన ఓటు దొంగాలించటం తో అధికార పార్టి పై పోటీ కి దిగటం ,తను కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ చెయ్యటం గెలవటం ఇవన్ని సినిమాటిక్ గానే అనిపిస్తాయి .అయితే కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ను చాలా బాగా తీర్చిదిద్దాడు మురుగదాస్ .మంచి పొలిటికల్ హీట్ వున్నా చిత్రం కావటం తో ఈ సినిమా విజయ్ అభిమానులకు అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు .ఇక ఇతర వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి .

తమిళం సినిమా లు అనగానే మన తెలుగు లో  నేటివిటి సమస్య వెంటాడుతుంది .అందులోను సర్కార్ సినిమా కి ఈ సమస్య వుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు .తమిళం లో జరిగే ఎన్నికల డ్రామా నేపధ్యం లో తెరకేక్కటం తో కొన్ని సన్నివేశాలు లో నేటివిట సమస్య వుంది మరి  ఈ సినిమా ని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి .

సాంకేతిక వర్గం :

రెహమాన్ పాటలు ఒకే అనిపించినప్పటికీ బాక్గ్రౌండ్ స్కోర్ లో మాత్రం రెహమాన్ తన విశ్వరూపాన్ని చూపించాడు .కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో రెహమాన్ నేపధ్య సంగీతం అయితే విజయ్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకుంటాయి అనటం లో ఎటువంటి సందేహం లేటు .ఇక గిరీష్ గంగాధర్ ఛాయాగ్రహణం కుడా చాలా బాగుంది .అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు చాల అధ్బుతం రిచ్ గా వున్నాయి .

సర్కార్ రివ్యూ : విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ …అయితే సర్కార్ సినిమా గతం లో  మురుగదాస్ , విజయ్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి , తుఫాకి సినిమా ల దరిదాపుల్లోకి కుడా రాదు .\

Rating: 2.8/3

Sarkar Telugu Trailer Watch here:

Vinaya Vidheya Rama Fist Look teaser  click here: https://youtu.be/Xwvu0C2UOtc

 

Leave a Reply

Top
%d bloggers like this: