Director Maruti Sepreme Hero Sai Dharam Tej Movie Title Prati Roju Pandage | Maruti | Sai Tej | UV Creations | Geeta Arts 2 |

sai-dharam-tej-movie-title-prati-roju-pandage

Director Maruti Sepreme Hero Sai Dharam Tej Movie Title Prati Roju Pandage | Maruti | Sai Tej | UV Creations | Geeta Arts 2 |

Director Maruti Sepreme Hero Sai Dharam Tej Movie Title Prati Roju Pandage | Maruti | Sai Tej | UV Creations | Geeta Arts 2 |

యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు మారుతి .ఈ రోజుల్లో చిత్రం తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మారుతి తన ఒక్కొక్క సినిమా తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు సినిమా పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు .మారుతి సినిమా అంటే అయితే హిట్ లేదంటే యావరేజ్ అనే ఒక మార్క్ ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు మారుతి .యూత్ కి కనెక్ట్ అయ్యే టాపిక్ ని ఎంచుకుని అందరికి అర్ధమయ్యేలా చాలా చక్కగా చూపిస్తూ ,సినిమాని  తనదైన మార్క్ తో ప్రజెంట్ చేయటం లో దర్శుకుడు మారుతి కి వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు .

ప్రస్తుతం మారుతి మెగా సుప్రీమ్ హీరో సాయి ధర్మ తేజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు .దీంతో మెగా అభిమానుల్లోనూ మరియు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా స్టొరీ ఎలా ఉండబోతుంది అనే విషయం లో కొంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే మారుతి గతం సినిమా లు చుస్తే గనుక విభిన్నమైన కథలతో మంచి బ్లాకు బస్టర్ లు సాధించాడు .దీంతో అసలు ఈ సినిమా ని ఏ పాయింట్ తో తెరకెక్కిస్తున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది .ఇక హీరో సాయి తేజ్ విషయానికొస్తే చాలా రోజుల తరువాత చిత్ర లహరి వంటి సినిమా తో విజయాన్ని అందుకున్నాడు .కాని అది సాయి తేజ్ రేంజ్ హిట్ కాదు కాబట్టి ఇప్పుడు సాయి తేజ్ ఈ సినిమా తో తప్పకుండ బ్లాకు బస్టర్ కొట్టాలి అలాగే మారుతి కి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం .

భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో మతి మరుపు అనే పాయింట్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు ఈ సినిమా బ్లాకు బస్టర్ విజయం సాధించింది ,అలాగే మహానుభావుడు సినిమా లో హీరోకి ఒసిడి అనే పాయింట్ తెరకెక్కించాడు ఈ సినిమా కూడా ఒక మాదిరి విజయాన్ని అందుకుంది .ఇక మరి ఇప్పుడు సాయి తేజ్ తో తెరకెక్కనున్న సినిమా ఏ నేపధ్యం లో ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి వుండాలి .అయితే ఈ సినిమా లో హీరోయిన్ మాత్రం టిక్ టాక్ వీడియో లు వాటిని షేర్ చేసే నేపధ్యం లో ఎలాంటి చిక్కువచ్చి పడింది అనేది ఒక పాయింట్ గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అని సమాచారం .

ఇక ఈ సినిమా ని 2020 సంక్రాంతికి విడుదల చేసేవిధంగా చిత్ర యూనిట్ హర్డ్ వర్క్ చేస్తుంది అట .ఈ సినిమాని  గీతా ఆర్ట్స్ 2 మరియు uv క్రియేషన్స్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి .ఈ సినిమా కి ప్రతి రోజు పండగే అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో చిత్ర యూనిట్ వుందని సమాచారం .అలాగే ఈ సినిమా లో హీరొయిన్ గా రేజీనా ని అనుకున్నారు అట కాని మంచి క్రేజ్ వున్నా హీరోయిన్ పెట్టె ఆలోచనలో మారుతి వున్నాడు అట ఈ విషయాలు పై అధికారిక ప్రకటన రావలసి వుంది .

Leave a Reply

Top
%d bloggers like this: