Robo 2.o Movie Review | Rajnikantha | Akshay Kumar | AR Rahman |

robo 2.o Movie review

Robo 2.o Movie Review | Rajnikantha | Akshay Kumar | AR Rahman |

Robo 2.o Movie Review :

నటీనటులు : రజనికాంత్ , అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ,సుధంసు పాండే , కళాభవన్  షాజన్ ,ఆదిల్ హుసేన్ ,రియాజ్ ఖాన్

సంగీతం : ఎఆర్ రెహమాన్

ఎడిటింగ్ :అంటోనీ

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శంకర్

సూపర్ స్టార్ రజనికాంత్ ,అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆ అంచనాలను మనం ఊహించలేము అయితే గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో 2 .ఓ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే ఇండియన్ సినిమా స్థాయిని మరో రేంజ్ కి తీసుకెళ్ళిన చిత్రం రోబో ఆ సినిమా సీక్వెల్ గా ఇప్పుడు రోబో 2 .ఓ రాబోతుంది ఈ సినిమా మొదలైనప్పటి నుండి భరే అంచనాలు ఏర్పడ్డాయి ఇక ప్రేక్షకులు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావటం జరిగింది .అయితే ప్రేక్షకులు ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలను మించేలా ఈ సినిమా ఉందా అసలు ఈ సినిమా కథ ఏమిటి రోబో కి రోబో 2 .ఓ కి ఏమైనా సంబంధం ఉందా నేది రివ్యూ లో చూద్దాం .

కథ :

ఉన్నట్టుండి  హటాత్తుగా చెన్నై నగరం లో సెల్ ఫోన్ లు మాయమవటం జరుగుతుంది ఎందుకిలా జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు .ఈ తరుణం లో ఆ అంతుచిక్కని అదృశ్య శక్తికి ఒక మొబైల్ కంపెని ఓనర్ ,మినిస్టర్ ,ఒక మొబైల్ కంపెని సి ఇ ఓ లు కుడా హత్య చేయబడతారు  దీని పై ప్రభుత్వం ఏమి చెయ్యలేక చివరికి సైంటిస్ట్ వశీకరన్(రజనికాంత్ ) సహాయం కోరుతుంది .దీంతో వసీకరాన్ తన హ్యుమనయిడ్ రోబో వెన్నెల(అమీ జాక్సన్ ) సహాయం తో డిస్ మ్యంటిల్ చేసిన చిట్టి ని రీ లోడ్ చేస్తారు .ఇక రీ లాంచ్ అయినా చిట్టి సహాయంతో వసీకరన్ ఇదంతా గతం లో ఉరి  వేసుకుని చనిపోయిన పక్షి రాజు(అక్షయ్ కుమార్ ) చేస్తున్నాడు అని కనిపెడతాడు .ఆ తరువతా చిట్టి ఆ శక్తిని ఎలా అడ్డుకోగాలిగాడు, అసలు చిట్టి రోబో  2 .ఓ గా ఎలా మారాడు , పక్షిరాజుకి సెల్ ఫోన్ కి సంబంధం ఏమిటి  అన్నదే ఈ కథ .

విశ్లేషణ :

ఇక రోబో 2 .ఓ కథ విషయానికొస్తే ఇక్కడ మనం ముందు గతం లో వచ్చిన రోబో సినిమా గురించి మాట్లాడుకోవాలి శంకర్ రజనికాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే ఐటీ ఆ సినిమా అంట విజయం సాధించటానికి ఆ సినిమాలో కేవలం గ్రాపిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కారణం కాదు వీటితో పాటు గా రోబో సినిమా లో కామెడి , ఎమోషన్స్ ,థ్రిల్లింగ్ ,లవ్ వంటి అన్ని అంశాలను శంకర్ ఇందులో నింపిన యంత్రాన్ని  ప్రేక్షకుల ముందకు వదిలాడు అని చెప్పొచ్చు .

మరి రోబో సినిమా కి సీక్వెల్ గా వచ్చినా రోబో 2 .ఓ కుడా ఇలానే నవరసాలతో నిడిన యంత్రమా అంటే కాదు అనే చెప్పాలి .రోబో 2 .ఓ అనేది కామెడి ,లవ్,ఎమోషన్స్ , వంటివి లేకుండా కేవలం థ్రిల్లింగ్  విజువల్ గ్రాపిక్స్ తో నిండి ఒక అధ్బుతమైనా ప్రపంచం మాత్రమే .గతం లో రోబో సినిమా లో విజువల్స్ తో పాటు అన్నింటి పైన శ్రద్ధ వహించిన శంకర్ ఈ సినిమా లో కేవల గ్రాపిక్స్ విజువల్స్ పైన మాత్రమే ద్రుష్టి పెట్టాడు అనటం లో ఎటువంటి సందేహం లేదు .అయితే ఇక మనం రోబో 2 .ఓ విషయనికొస్తే ఈ సినిమా ఊహించలేని విజువల్స్ గ్రాపిక్స్ మాయాజాలం తో నిండినా ఒక అదుతమైనా ప్రపంచం ఈ సినిమా లో విజువల్స్ ని కొన్ని గ్రాపిక్ సన్నివేశాలను చూస్తున్నంత సేపు మనకు ఎదో హాలీవుడ్ సినిమా చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఈ సినిమా ని 3 d ఎఫెక్ట్స్ లో చుస్తే గనుక మనం మాటల్లో చెప్పలేము .

ఇక దర్శకుడు శంకర్ విషయానికొస్తే అసలు శంకర్ కి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అనేది ప్రతి ప్రేక్షకుడి లోని ఆసక్తి నేలకోవటం మాత్రం సహజం కథ రాసి సినిమా ఎవ్వరైనా తియ్యగాలను కాని ఒక కథ తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేది మాత్రం ముమ్మాటికి అది శంకర్ అనే చెప్పాలి .ఇక ఈ సినిమా లో రోబో  చిట్టి , మాయ శక్తి పక్షి రాజుని మొదటి సారి చూసినప్పుడు వీరిద్దరి మధ్య జరిగీ యాక్షన్ సీన్స్ అయితే అలాగే అద్దానికి పట్టినట్టు చూస్తూనే ఉండిపోతాము .ఇలాంటివి ఈ సినిమా లో మనకు అడుగడుగునా కనిపిస్తాయి ఈ సినిమా కి 600 కోట్ల బడ్జెట్ అనగానే అందరికి ఆశ్చర్య వేసింది కాని శంకర్  ప్రతి రూపాయని ఈ సినిమా లో చాలా క్వాలిటీ గా చూపించాడు ఏదేమైనా ఇలాంటి  ఊహకు అందని మాయాజాలం తో ఒక కథని తెరకెక్కించటం అంటే అది శంకర్ ఒక్కరికే సాధ్యం అని చెప్పొచ్చు .ఇక ఈ సినిమా కు గ్రాపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా అంచనాలు మించేలా వుంటుంది అలాకాకుండా అన్ని ఆశించి వెళితే కనుక కొన్ని మిస్ అవుతాయి అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలి అంటే ఒక తెలుగు సినిమా గా కామెడి ,లవ్,ఎమోషన్స్ వంటి వాటిని ఆశించే వారికి ఈ సినిమా వాళ్ళని కొంత మేరకు మాత్రమే సంతృప్తి పరచాగలదు అని చెప్పాలి .

నటీ నటులు :

ఇక ఈ సినిమా లో నటీ నటుల గురించి చెప్పుకోవాలి అంటే కేవలం ముగ్గురే ముగ్గురు వారే సూపర్ స్టార్ రజనికాంత్,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ లు ..ఇక అసుపెర్ స్టార్ రజనికాంత్ విషయానికొస్తే ఆయన నటన ఎంతటి వాడినా దిగిరవాల్సిందే అన్నట్టు వుంది ఎందుకంటే ఈ వయసులో రోబోలాంటి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం అంటే అది ఆశామాషీ కాదు కాని సూపర్ స్టార్ మాత్రం చాల సింపుల్ గా తన స్టైల్ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో సినిమాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్ళాడు .ముఖ్యంగా చివరిలో వచ్చే చిట్టి పాత్రలో అయితే ఆ హుషారు ఆ స్టైల్ అయితే అదుర్స్ .ఇక సినిమా లో మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ..పక్షి రాజు గా భయంకరమైనా రూపంతో ప్రేక్షలను భయపెట్టాడు ఈ పాత్రలో అక్షయ్ ని తప్ప వేరేవరిని ఊహించుకోలేము .ఇక అక్షయ్ ప్లాష్ బ్యాక్ లో పక్షులకోసం పక్షి జాతి బగుల కోసం తపన పడే వృద్దుడి పాత్రలో మెస్మరైజ్ చేసాడు .ఇక అందాల భామ అమీ జాక్సన్ విషయనికొస్తే సోషల్ మీడియానే తన ఘాటు ఘాటు ఫొటోలతో హీటేక్కిస్తుంది అంటే ఇక ఈ భామ వీరంగం సినిమా లో అయితే ఎలా వుంటుందో అని ఊహించికోవచ్చు కాని ఈ సినిమా లో ఈ భామకి ఆ అవకాసం రాలేదు .రోబో పాత్ర చేయటం తో ఎక్కడ స్కిన్ షో కి అవకాసం వుండదు కాబట్టి రోబో పాత్రలో తన నటన తో ఈ హాట్ బ్యూటీ బాగా ఆకట్టుకుంది .

సాంకేతిక వర్గం :

రోబో 2 .ఓ రూపకర్త శంకర్ విషయానికొస్తే తన ప్రతి సినిమాలోనూ ఇదొక సందేశాన్ని ఇస్తూ దానితో పాటు అన్నిటిని సమపాళల్లో ఉండేట్టు చూసుకునే శంకర్ ఈ సినిమా లోను కుడా మొబైల్స్ వల్ల పక్షులకు నష్టం జరుగుతుంది అనే సందేశాన్ని ఇచ్చాడు కాకపోతే కేవలం ఈ సినిమాని విజువల్స్ కి మాత్రమే అపరిమితం చేసాడు .ఏదేమైనా శంకర్ ఈ సినిమాతో ఇండియన్ సినిమా లు హాలీవుడ్ సినిమా లకి ఏ మాత్రం తీసిపోవు అనేలా  నిరూపించాడు అని చెప్పొచ్చు

ఇక సినిమా కి మరో ముఖ్యమైనా ఆకర్షణ సంగీత సినిమా ఎంత విజువల్స్,గ్రాపిక్స్ తో నింపి నప్పటికీ వాటికి తగ్గట్టు గా బాక్గ్రౌండ్ సంగీతం లేక పొతే అవన్నీ మూగ జీవులే అని చెప్పొచు .కాబట్టి ఈ సినిమా లో రెహమాన్ సంగీతం విషయానికొస్తే కేవలం రెండు పాటలతో అంతంత మాత్రంగానే సరిపెట్టిన రెహమాన్ తన సత్తాని పూర్తిగా సినిమా నేపధ్య సంగీతం లో చూపించాడు .కొన్ని కూన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కపోదిచేల నేపధ్య సంగీతాన్ని అందించాడు .

ఇక ఈ మాయాజాలాన్ని ఇంట అద్భుతంగా చూపించినా నీరవ్ షా పనితనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది ఇక క్లైమాక్స్ లో చిట్టి ,పక్షిరాజు మధ్య వచ్చే సన్నివేశాల్లో నీరవ్ షా పనితనం చాలా అద్భుతంగా వుంటుంది .

అంటోనీ ఎడిటింగ్ అయితే అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే కేవలం రెండు పాటలతో సినిమా ని ఎక్కడా బోరుకొట్టకుండా తీసుకెళ్ళాడు .ఇక ఈ సినిమా కి మరో హైలెట్ ఫైట్స్ అని చెప్పొచ్చు ,చిట్టి ,పక్షిరాజు మధ్య వచ్చే ఫైట్లు చాల అద్భుతంగా వుంటాయి .ఇక లైకా నిర్మాణ విలువలు గురించి మనం మాట్లాడాలి అంటే 600 కోట్ల తో ఒక అదుతమైనా ప్రపంచాన్ని నిర్మించారు అని చెప్పొచు .

చివరిగా : రోబో 2.ఓ విజువల్స్ , గ్రాపిక్స్ వంటి మాయజాలంతో నిండిన ఒక అద్భుతమైనా ప్రపంచం

రేటింగ్ : 3..8/5

Robo 2.o reviews Effect Watc Here:

Esha Gupta HOt BIkini Video Click HEre: https://youtu.be/b1vKnbunmPM

 

Leave a Reply

Top
%d bloggers like this: