Pandem Kodi 2 Movie Review | SandaKozhi2 Review | Vishal | Keerthy Suresh | Varalaskhmi SarathKumar | Lingu Swamy |

Pandem Kodi 2 Movie Review

Pandem Kodi 2 Movie Review | SandaKozhi2 Review | Vishal | Keerthy Suresh | Varalaskhmi SarathKumar | Lingu Swamy |

Pandem Kodi 2 Movie Review:

పందెం కోడి 2 రివ్యూ :

విశాల్ , లింగు స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ పందెం కోడి 2. గతం లో  విశాల్ , లింగు స్వామి కాంబినేషన్ లో వచ్చిన పందెం కోడి ఘన విజయం సాధించటమే కాకుండా విశాల్ కి , లింగు స్వామి కి మంచి కెరీర్ ను అందించిన చిత్రం గా నిలిచింది మరల ఇదే కాంబినేషన్ లో పందెం కోడి కి సీక్వెల్ పందెం కోడి 2 ను తెరకెక్కించాడు లింగుస్వామి అయితే ఈ సినిమా అటు తమిళం లోను ఇటు తెలుగు లోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి .విజయదశమి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందు రానుంది ఈ తరుణం ఈ సినిమా కి గట్టి పోటీ నెలకొంది రామ్ పోతినేని నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమా కూడా ఈ రోజే విడుదల కావటం తో అటు అరవింద సమేత , ఇటు హలో గురు ప్రేమ కోసమే సినిమా తో పందెం కోడి 2 భారీ పోటీని ఎదుర్కోనుంది . ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పందెం కోడి 2 సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది ,ఈ పోటీని ఎలా ఎదుర్కోనుంది , ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు ఆకట్టుకుంటుందో ఒక చిన్న  రివ్యూ లో చూద్దాం.

Pandem Kodi 2 Movie Review:

కథ  :

రాజా రెడ్డి అనే పెద్దాయన అక్కడ చుట్టూ ప్రక్కల వుండే గ్రామాలకు పెద్ద మనిషి గా వుంటాడు ప్రతి ఏటా ఈ చుట్టూ ప్రక్కల వుండే గ్రామాల వారందరూ కలసి వీర భద్ర జాతర ను చాల ఘనంగా  జరుపుకుంటూ వుంటారు .అయితే ఈ జాతర లో అందరూ కలసి భోజనం చేస్తుండగా రెండు కుటుంబాల కు చిన్న గొడవ జరుగుతుంది .ఈ గొడవలో వున్నా ఒక కుటుంబం భవాని (వరలక్ష్మి శరత్ కుమార్ ) భర్త చనిపోవటం తో  ఇరు కుటుంబాల మధ్య పగలు పెరుగుతాయి ఈ తరుణం లో  భవాని కుటుంబం  వారు అవతలి కుటుంబానికి చెందినా వారిని ఒక్కొక్కరుగా అందరిని చంపేస్తారు అయితే అనుకోకుండా అందులో గోపి అనే ఒక వ్యక్తీ   మిగులుతాడు అతనిని కూడా చంపితేనే మొత్తం పగ తీరుతుంది అని ఆ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వ్యక్తికీ అండగా రాజా రెడ్డి వుంటాడు. ఇక  ఈ  గొడవ కారణంగా ఆ గ్రామాల్లో  ఏడు సంవత్సరాల నుండి వీర భద్ర జాతరను జరపటానికి ఎవరు అంగీకరించారు .దీంతో ఆ గ్రామాల్లో కరువు సంభవిస్తుంది దీంతో ఈ సంవత్సరం ఎలాగైనా సరే జాతర జరపాలని భావించి రాజారెడ్డి ఆ గ్రామాల చుట్టూ ప్రక్కల వున్నా పెద్దలను ఒప్పిస్తాడు దీంతో అందరూ జాతర జరపటానికి అంగీకరించటం తో జాతరను మొదలు పెడతారు .అయితే భవాని మాత్రం గోపి ని ఎలాగైనా ఈ జాతర్ లో చంపాలని ప్లాన్ చేస్తారు .ఇక ఈ జాతర కోసం విదేశాల్లో వున్నా రాజ రెడ్డి కుమారుడు బాలు  (విశాల్ ) తమ ఊరికి వస్తాడు .ఈ జాతర మొదలైనా నాలుగో రోజు భవాని మనుషులు గోపిని చాపటానికి వచ్చినప్పుడు రాజా రెడ్డి అడ్డుపడతాడు ఈ తరుణం లో రాజా రెడ్డి గాయపడతాడు .ఈ తరుణం లో బాలు ఏం చేసాడు , గోపి అనే వ్యక్తిని కాపాడగాలిగారా ,తండ్రి మాట కోసం బాలు ఏం చేసాడు అన్నదే ఈ సినిమా కథ .

విశ్లేషణ  :

ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి ఈ కథలో కొత్తదనం అయితే ఏమి లేడి కేవలం  వారం రోజులు జరిగిన జాతర చుట్టూనే తిరుగుతూ వుంటుంది కథ మొత్తం ఈ నేపద్యం లో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మిదిగా నడిచాయి అనే చెప్పొచ్చు ,ఈ సినిమా కి కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం చాల హై లెట్ గా నిలిచాయి .ఇలాంటి పాత కథకి లింగుస్వామి మంచి యాక్షన్ సీన్స్ ను జోడించి బాగానే తీర్చి దిద్దారు యాక్షన్ సినిమాలు కావాలి అనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు .ఇక ఈ సినిమా లో విశాల్ నటన   ఈ సినిమా కి హైలెట్ అని చెప్పొచ్చు ద్వీతియర్ధం లో వచ్చిన కొన్ని ఎమోషన్ సీన్స్ లో విశాల్ చాల అద్భుతంగా నటించాడు .విశాల్తండ్రి గా రాజా కిరణ్   కూడా గంభీరం గా కనపడుతూ పెద్ద మనషి పాత్రలో అదరగొట్టాడు .ఇక ఈ సినిమా విశాల్ కి జంటగా నటించిన అందాల భామ మహానటి కీర్తి సురేష్ తన కెరీర్ లో ఇప్పటివరకు చెయ్యని పాత్రను ఈ సినిమా లో చేసింది అల్లరి పిల్లగా  అందరిని ఆకట్టుకుంది ఇక మరో భామ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా విలన్ పాత్రలో విశాల్ కి పోటీ పడి మరీ నటించింది అని చెప్పొచ్చు .ఈ సినిమా కి యువన్ శంకర్ raja సంగీతం అంతగా లేదు పందెం కోడి సినిమా తో పోల్చుకుంటే మ్యూజిక్ పరంగా ఈ సినిమా చాలా లోటు కనిపిస్తుంది .శక్తి వెల్ ఫోటోగ్రఫీ మాత్రం చాల బాగుంది ఈ సినిమా లో ముఖ్యం గా సాగే జాతర వాతావరణాన్ని చాల చక్కగా చూపించాడు .

ప్లస్ పాయింట్స్ :

విశాల్ నటన
వరలక్ష్మి శరత్ కుమార్ నటన
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టొరీ
పాటలు
సంగీతం

చివరిగా : యాక్షన్ చిత్రాలను కోరుకునే వారికి ఫుల్ మీల్స్ పందెం కోడి 2

రేటింగ్: 3/5

Pandemo Kodi 2 Movie Telugu Trailer Watch Here:

Chakka Chakka ChamChakka Hot Dj Video Song Click Here: https://youtu.be/i6SHwjAfFt8

 

Leave a Reply

Top
%d bloggers like this: