Hello Guru Prema Kosame Movie Review | HGPK Review | Ram Potineni | Anupama Parameswaran | Pranitha |

Hello Guru Prema Kosame Movie Review

Hello Guru Prema Kosame Movie Review | HGPK Review | Ram Potineni | Anupama Parameswaran | Pranitha |

Hello Guru Prema Kosame Movie Review :

హలో గురు ప్రేమ కోసమే మూవీ రివ్యూ:

నేను లోకల్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాద్ , మరియు ఎనర్జీ టిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ సినిమా ఫ్యామిలీ అండ్  ఫీల్   గుడ్ లవ్ ఎంటర్ టైనర్.ఈ సినిమాని లక్ష్మన్ రాజు ,హరీష్ రెడ్డి , శిరీష్ , దిల్ రాజు కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు .హలో గురు ప్రేమ కోసమే సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు .అయితే హలో గురు ప్రేమకోసమే సినిమా ఈ రోజు విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .అయితే ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందులోను యువత ఈ సినిమా మంచి అంచనాలు పెట్టుకున్నారు .ఇక చిత్ర యూనిట్ కూడా గ్యారంటి గా  హిట్ అవుతుంది అని దీమా ని వ్యక్తం చేస్తున్నారు .అందులోను రామ్ సరైన హిట్ లేక ఒక మంచి బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ,ఇక దిల్ రాజు కి అయితే సంవత్సరం అంతగా కలసి రాలేదు కనీసం ఈ సినిమా తోనైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు .మరి వీరి అంచనాలను  హలో గురు ప్రేమ కోసమే ఎంత వరకు రీచ్ అయింది అనేది మనం హలో గురు ప్రేమ కోసమే రివ్యూ లో చూద్దాం …

Hello Guru Prema Kosame Movie Review :

కథ :

సంజయ్ (రామ్ ) అనే కుర్రాడు చదువు పూర్తీ చేసి తమ వూరు కాకినాడ లో ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు .ఇలా అయితే సంజయ్ కెరీర్ పాడైపోతుంది అని గమనించి సంజయ్  తండ్రి సంజు ని ఉద్యోగం కోసం హైదరాబద్ వెళ్ళమంటాడు .సంజు కి హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం లేకపోయినా తండ్రి మాట కోసం హైదరాబద్ వచ్చి ఉద్యోగం సంపాదిస్తాడు .సంజయ్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ సంజయ్ తల్లి స్నేహితుడు అయినా విశ్వనాధం ఇంట్లో వుంటాడు .ఈ తరుణం లో సంజయ్ విశ్వనాధం కూతురి అనుపమ (అనుపమ పరమేశ్వరన్ ) ప్రేమలో పడతాడు .ఇదే సమయంలో  సంజయ్ ఆఫీస్ లో సహ ఉద్యోగి రీతూ (ప్రణీత ) సంజయ్ ని ప్రేమిస్తుంది .విశ్వనాధం తన కూతురు అనుపమకి  కార్తిక్ (నోయల్ ) తో పెళ్లి కి  ఒకే చేస్తారు.ఈ తరుణం లో సంజయ్ తన ప్రియురాలు అనుపమ ని ఎలా దక్కించు కున్నాడు ,రీతూ ఏమైంది అనేది మిగతా కథ  .

విశ్లేషణ :

సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా కథని చలా చక్కగా ఆవిష్కరిస్తూ సరదాగా ..తీసుకెళ్ళిపోయాడు దర్శకుడు త్రినధారావు .  సినిమా  ఫస్ట్ అఫ్ అంతా చాల ఎంటర్ టైన్మెంట్ గా యూత్ ఫుల్ గా జోష్ గా సాగిపోతుంది ప్రదమార్ధం లో ముఖ్యం చెప్పుకోవలసినవి డైలాగ్స్ మరియు కొన్ని కామెడి సన్నివేశాలు బాగుంటాయి  .ఇక సెకండ్ అఫ్ లో సినిమా అంతా కొంచెం ఎమోషన్ గా వెళ్ళుతుంది .రామ్ ,ప్రకాష్ రాజ్ ల మధ్య కామెడి కూడా బాగుంటుంది .కాకపోతే క్లైమాక్స్ లో కొత్తదనం ఏమి కనిపించలేదు .ఇక కథలో కూడా  కొత్తదనం ఏమి లేదు అనే చెప్పాలి ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కథ లో తరువాత ఏమి జరుగుతుంది అనేది ఈజీగా అర్ధమైపోతుంది దీంతో కథలో ఆసక్తి కరమైన విషయాలు ఏమి లేవు అనే చెప్పాలి .ఇక కథ విషయానికొస్తే రొటీన్ స్టొరీ కాని దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన బలమైనా డైరెక్షన్ తో సినిమా చాల అద్భుతంగా తీర్చి దిద్దాడు .ఇక హీరో రామ్ పెర్ఫామెన్స్ అన్ని సినిమాల్లాగే చాల బాగా చేసాడు అంతేకాకుండా రామ్ లుక్ ఈ సినిమా చాల అందంగా కనిపించింది ,అనుపమ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా కోపంగా వుంటూ చాల బాగా నటించింది ,ఈ సినిమా లో మరొక కథానాయిక ప్రణీత చోప్రా కూడా చాల బాగా చేసింది,ఈ సినిమా కి మరో కీలకమైనా పాత్ర విశ్వనాధం గా ప్రకాష్ రాజ్ ఇదివరకు లానే  తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు ,మిగిలిన పాత్రలు కూడా వారికీ తగ్గట్టుగా చాల బాగా చేసారు .

సాంకేతిక వర్గం పని తీరు :

ఈ సినిమా ని నిలబెట్టడానికి దర్శకుడిగా తను చేసిన ప్రయత్నం ఫలిచింది కథ పాతదే అయిన దర్శకుడు మాత్రం సినిమా ని చాల మంచిగా తీర్చిదిద్దాడు .ఇక రచయిత ప్రసన్న కుమార్ కథ పరంగా పరువాలేదు అనిపించినా డైలాగ్స్ మాత్రం చాల బాగా రాసాడు ఈ సినిమా లో డైలాగ్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పొచ్చు.దేవి శ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమా లో అంతగా లేదు దేవి ఏ సినిమా అయినా సరే తన నేపధ్య సంగీతం తో సినిమా ని మరో లెవెల్ కి తీసుకెళతాడు కాని ఈ సినిమా లో మాత్రం దేవి తన మ్యూజిక్ కి అంత అంత మాత్రం గానే కానిచ్చేసాడు .

ప్లస్ పాయింట్స్ :

నక్కిన త్రినధారావు డైరెక్షన్

రామ్ ,ప్రకాష్ రాజ్ ,అనుపమ పరమేశ్వరన్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టొరీ
మ్యూజిక్

చివరిగా : హలో గురు ప్రేమ కోసమే రొటీన్ లవ్ ఎంటర్ టైనర్

రేటింగ్ : 3/5

Hello Guru Prema Kosame Trailer Watch Here:

Chekka Chekka ChemaChekka DJ Video Song Clcick Here : https://youtu.be/i6SHwjAfFt8

 

Leave a Reply

Top
%d bloggers like this: