Chiranjeevi International School Starting from This Year

Chiranjeevi International School

Chiranjeevi International School Starting from This Year

Chiranjeevi International School Starting from This Year

తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరెస్ట్ స్థానం లో నిలిచినా చిరు ,సామజిక సేవ విషయం లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు .అయితే తాజా సమాచారం ప్రకారం మెగా స్టార్ ఇప్పుడు విద్యా రంగం లోకి అడుగు పెట్టబోతున్నారు .పిల్లలకు నాణ్యమైన విద్య మరియు రేపటి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దాలని  చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ను మొదలుపెట్టనున్నారు ఇప్పటికే వీటి పనులు శరవేగంగా సాగుతున్నాయి .అయితే మొదటి ఈ స్కూల్స్ శ్రీకాకుళం లో ప్రారంభించనున్నారు .ఉత్తర ఆంధ్ర లో మెగాస్టార్ కి వున్నా ప్రత్యేకత అందరికి తెలిసిందే .

దీంతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ను మొదటగా శ్రీకాకుళం నుండి ప్రారంభించి ఆ తరువాత ఒక్కొక్కటిగా ప్రతి సిటి లోను కూడా ప్రారంభించనున్నారు .అయితే ఈ స్కూల్స్ ను ఈ సంవత్సరమే మొదలు పెట్టనున్నారు .చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కి సంబందించిన అన్ని పనులను నాగబాబు మరియు చరణ్ లు చూసుకుంటున్నారు .ఇక మెగా అభిమానుల పిల్లలకు  ఈ స్కూల్స్ లో ప్రత్యేక రాయితీ లను కూడా అందించనున్నారు .అయితే ఈ స్కూల్స్ లో ఈ విద్య సంవత్సరానికి గాను నర్సరీ నుండి 5 వ తరగతి వరకు అడ్మిషన్స్ ను మొదలు పెట్టనున్నారు .

Leave a Reply

Top
%d bloggers like this: