Lagadapati Raja Gopal Survey AP Elections Results 2019 May 19th at Tirupati | AP Ellections Results |

AP Elections Results 2019

Lagadapati Raja Gopal Survey AP Elections Results 2019 May 19th at Tirupati | AP Ellections Results |

Lagadapati Raja Gopal Survey AP Elections Results 2019 May 19th at Tirupati

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి దీనికి కారణం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు అయితే ఎన్నికలు ఫలితాలు దగ్గరకు వస్తున్నాయి మరో మూడు నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు దగ్గర పడుతుండటంతో ఆంధ్ర ప్రజల్లో ఎవరు నెగ్గుతారు అనేది ఆసక్తి నెలకొంది .అయితే ఈ తరుణం లో ఇప్పటికే లగడపాటి రాజగోపాల్ సర్వ్ ఫలితాలు కుడా ఎప్పుడు విడుదల అవుతున్నాయి అనేది కొంత మందిలో ఆసక్తి నెలకొంది .ఇప్పటికే లగడపాటి తన సర్వే ఫలితాలను ఎన్నికల ఫలితాలకు రెండు మూడు రోజుల ముందే విడుదల చేస్తామని ప్రకటించాడు .

ఇక తను చెప్పినట్టుగానే లగడపాటి సర్వే ఫలితాలను మే 19 వ తేదీన తిరుపతి లో విడుదల చేస్తున్నట్లు ఈ రోజు ప్రెస్ మీట్ లో తెలియజేసారు .ఇక ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లగడపాటి కొన్ని ఆసక్తి కర విషయాలను బయటపెట్టాడు.లగడపాటి మాటల్లో మరియు సర్వే లో ఎంత నిజముందో తెలియదు కాని లగడపాటి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .అసలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరి లోను నెలకొంది ఇక బెట్టింగులు కుడా భారీ రేంజ్ లో జరుగుతున్నాయి .ఈ నేపధ్యం లో లగడపాటి సర్వ్ ఫలితాలు తో కొంత మందికి టెన్షన్ పెట్టుకుంది అనే చెప్పాలి .ఇక లగడపాటి ఆంధ్ర , తెలంగాణా సర్వ్ ఫలితాలును కూడా విడుదల చేయనున్నాడు .

ఇక ఈ ప్రెస్ మీట్ లో లగడపాటి తెలుగు ప్రజలు మరల సైకిల్ గుర్తునే కోరుకుంటున్నారు అని చెప్పారు .ఈ మాటలు బట్టి చుస్తే తెలుగు దేశం మరోసారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అని అర్ధమవుతుంది ఈ విషయాన్ని రేపు తిరుపతి లో స్పష్టంగా విడుదల చేయబోతున్న విషయాన్నీ తెలియజేసాడు లగడపాటి .

మరో వైపు లగడపాటి తన సర్వే లో పవన్ కళ్యాణ్ యొక్క విషయాన్నీ కూడా ప్రస్తావించారు .పవన్ కళ్యాణ్ వెలగపూడి శాసన సభకు వెళ్ళుతున్నారు అనేది కూడా చెప్పారు . అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి కంటే తక్కువ అంటూ చిన్న క్లూ ఇస్తూ  ఇక పూర్తీ వివరాలు అయితే రేపు సాయంత్రం తిరుపతి లో తెలియజేయటం జరుగుతుంది అన్నారు .అంతేకాకుండా ఆంధ్ర లో కచ్చితమైన మెజార్టీ ఒక పార్టీ కే వస్తుంది అని ఎటువంటి హంగ్ వుండదు అని చెప్పారు .

అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీ గతం తో పోల్చుకుంటే తక్కువ మెజార్టీ తో నే గెలుపు ను సాధిస్తుంది అని తెలియజేసారు

మొత్తానికి ..ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రాబోతుంది. లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ నే కోరుకున్నారు. ఏ పార్టీ కి ఎన్ని సీట్లో రేపు సాయంత్రం తిరుపతి లో ఆరు గంటలకు వెల్లడిస్తా.
అని కాంగ్రేస్ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్

Leave a Reply

Top
%d bloggers like this: