Allu Arjun Boyapati Srinu New Movie in Geetha Arts Banner | Allu Arjun | Boyapati Srinu | Allu Arvaind | Geetha Arts | Sarainodu 2 |

Allu Arjun Boyapati Srinu New Movie in Geetha Arts Banner

Allu Arjun Boyapati Srinu New Movie in Geetha Arts Banner | Allu Arjun | Boyapati Srinu | Allu Arvaind | Geetha Arts |

Allu Arjun Boyapati Srinu New Movie in Geetha Arts Banner | Allu Arjun | Boyapati Srinu | Allu Arvaind | Geetha Arts |

తెలుగులో మంచి కమర్షియల్ అండ్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా లను తెరకెక్కించ గల సత్తా కలిగిన డైరెక్టర్ బోయ పాటి శ్రీను అప్పటి భద్ర వరకు నిన్నటి వినయ విదేయ రామ వరకు అన్ని ఫుల్ యాక్షన్ సినిమాలే అంతేకాకుండా  భద్ర ,తులసి , సింహ ,లెజెండ్ ,సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ లను కూడా తన ఖాతా లో వేసుకున్నాడు .అయితే కొన్ని నెలల క్రితం అంటే మొన్న సంక్రాంతికి బోయపటికి గట్టి దెబ్బ తగిలింది అనే చెప్పాలి .ఎందుకంటే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ చరణ్ వినయ విదేయ రామ వంటి భారీ ఫ్లాపు ను అందించాడు అంతేకాకుండా ఈ సినిమా ఇప్పుడు బోయపాటికి శాపం గా మారింది  .వినయ విదేయ రామ దెబ్బతో నిర్మాతలు బోయపాటి జోలికి పోవటం లేదు దీంతో బోయపాటికి అవకాశాలు కరువయ్యాయి .సింహ .లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ లతో బాలయ్య కెరీర్ ని ట్రాక్ లో పెట్టినప్పటికీ బాలయ్య కూడా సీనయ్య తో సినిమా లు చెయ్యటం లేదు అంటే అర్ధం చేసుకోవచ్చు వినయ విదేయ రామ ఎంతటి పరాజయం అందించింది అనేది .నిర్మాతలు ఎవరు బోయపాటి వైపు చూడకపోవటం తో ఇక తనే నిర్మాతలను వెతుకుతున్నాడు అయినా సరే లాభం లేదు .

ఈ తరుణంలో అల్లు అరవింద్ తన కి తన గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేసే అవకాశం కల్పించాడు గతం లో సరైనోడు వంటి బ్లాకు బస్టర్ ని అందించాడు ఈ సినిమా బన్నీ కి మంచి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది .అంతేకాకుండా ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలను ఇప్పటికి చాల మంది రిపీట్ గా చూస్తూ వుంటారు .మరి ఇలాంటి బ్లాకు బస్టర్ హిట్ ని అందించిన బోయపాటి కి మరో బ్లాకు బస్టర్ అందించే అవకాశం ఇచ్చాడు అల్లు అరవింద్ .అయితే ఈ సినిమా లో ఇప్పటి వరకు హీరో ఎవరు అనేది తెలియలేదు కాని తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తానికి సరైనోడు కాంబినేషన్ మరల మరో హిట్ కి సిద్ధమయింది అనే చెప్పాలి .ప్రస్తుతం అల్లు అరవింద్ త్రివిక్రమ్ సినిమా లో బిజీగా వున్నాడు ఈ సినిమా అవగానే తదుపరి చిత్రం ఐకాన్ కూడా త్వరగా పూర్తీ చేసి బోయపాటి సినిమా ని మొదలుపెట్టే అవకాశం వుంది .

ఒక విధంగా ఇది బోయపాటికి అదృష్టం అనే చెప్పాలి అంతేకాకుండా ఈ సినిమా తన కెరీర్ కి చాలా ముఖ్యం అనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చిన బోయపాటికి కోలుకోలేని పరిస్తితి మొదలయినట్టే .కాబట్టి మరి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఇవ్వటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు బోయపాటి

Leave a Reply

Top
%d bloggers like this: